Hair Health : జుట్టు ఆరోగ్యానికి ఇలా చేస్తే సరి!

జుట్టుకు చక్కని కంటిషనర్ గా వెనిగర్ పనిచేస్తుంది. వెనిగర్ , నీళ్లు తగిన పాళ్లల్లో కలుపుకుని తలస్నానం చేసిన తరువాత రాయాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీళ్లతో జుట్టును కడుక్కోవాలి.

Hair Health : జుట్టు ఆరోగ్యానికి ఇలా చేస్తే సరి!

Hair Health : చర్మంతోపాటు జుట్టు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించటం ఎంతో అవసరం. అన్నికాలాల్లో జుట్టు మెరుపుదనంతో ఒత్తుగా ఉండాలంటే కొన్ని రకాల సూచనలు పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. పదేపదే జుట్టుకు కండిషనర్లు రాయటం ఏమాత్రం మంచిది కాదు. వీటికి బదులుగా ఇంట్లో లభించే వివిధ రకాల పదార్ధాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. జుట్టుకు ఉపకరించే వివిధ పదార్ధాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

జుట్టుకు గుడ్డు బాగా ఉపకరిస్తుంది. ఇందులోని పోషకాలు, ఫ్యాటీ అమ్లాలు జుట్టు పొడిబారకుండా కాపాడతాయి. రెండు గుడ్లను తీసుకుని అందులోని తెల్లసొనలో ఒక స్పూన్ ఆలివ్ నూనె, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. 30 నిమిషాల తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుపును సంతరించుకుంటుంది.

జుట్టుకు చక్కని కంటిషనర్ గా వెనిగర్ పనిచేస్తుంది. వెనిగర్ , నీళ్లు తగిన పాళ్లల్లో కలుపుకుని తలస్నానం చేసిన తరువాత రాయాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీళ్లతో జుట్టును కడుక్కోవాలి. అలాగే కప్పు నీళ్లలో రెండు స్పూన్ల వెనిగర్, నిమ్మరసం కలుపుకోవాలి. 10 నిమిషాల తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. దీని వల్ల జుట్టుకు మంచి మేలు కలుగుతుంది.

అలాగే కలబండ గుజ్జు నాలుగు స్పూన్లు, కొబ్బరి నూనె రెండు స్పూన్లు, పెరుగు మూడు స్పూన్లు కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీనిని తలకు పట్టించి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తు జుట్టు మృదువుగా మారుతంది. కొన్ని మందరాపువ్వులు తీసుకుని వాటిని మెత్తగా చేసుకోవాలి. దానికి అరకప్పు కలబంద గుజ్జు , ఒక స్పూన్ ఆలివ్ అయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల తరువాత తలస్నానం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.