గగన విహారం షురూ : ఫ్లైట్ ఎక్కాలంటే..ఈ నిబంధనలు తప్పనిసరి

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 12:32 AM IST
గగన విహారం షురూ : ఫ్లైట్ ఎక్కాలంటే..ఈ నిబంధనలు తప్పనిసరి

విమానాలు రెక్కలు విప్పుకునేందుకు సిద్ధమయ్యాయి. 2020, మే 25వ తేదీ సోమవారం నుంచే దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభంకాబోతున్నాయి. రెండు నెలల తర్వాత గగన విహారం చేనున్నాయి. ముందుగా పరిమిత సంఖ్యలో ఫ్లైట్లు నడపాలని కేంద్రం నిర్ణయించగా..దశలవారీగా సర్వీసులు పెంచుతారని తెలుస్తోంది. కానీ..భారీగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ సహా అనేక సేఫ్టీ ప్రికాషన్స్ అమలు అవుతాయని కేంద్ర విమానయానశాఖ ప్రకటించింది.

కరోనా వైరస్ మెల్లగా వ్యాప్తి చెందుతున్న దశలోనే కేంద్రం మార్చి 24 నుంచి డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్స్‌పై బ్యాన్ విధించింది. దీంతో అప్పట్నుంచి విమానసర్వీసులు రద్దు అయ్యాయి. ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు మాత్రం అడపాదడపా విమానాలు నడిచినా..సాధారణ జర్నీలు మాత్రం జరగలేదు. 

నిబంధనలు : – 
ఎయిర్‌పోర్టుల వద్దకు ప్రయాణీకులు రెండు గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుంది..అలానే ఫిజికల్ చెక్ ఇన్‌ ఉండదు.. విమానాశ్రయ ఎంట్రెన్స్‌ దగ్గర ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ముందుగా ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. యాప్ లేకపోతే కరోనా సోకలేదనే నిర్ధారణ పరీక్షతో కూడిన సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పెద్దవయస్సు ఉన్నవారు, గర్భిణులు ప్రయాణం చేయవద్దని కేంద్రం సలహా ఇచ్చింది. అలానే జర్నీ సమయంలో ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి..హ్యాండ్ శానిటైజర్లు వాడాలి.. ప్రయాణీకులలో కరోనా లక్షణాలు తర్వాత  బయటపడితే ఆయా రాష్ట్రాల ప్రోటోకాల్ ప్రకారం హోమ్ క్వారంటైన్ లేదంటే ఐసోలేషన్ వార్డులకు తరలాల్సి ఉంటుంది..

సర్వీసులు వద్దన్న మూడు రాష్ట్రాలు : – 
దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభించడానికి కేంద్రం అనుమతి ఇచ్చినా మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు మాత్రం తమ రాష్ట్రాల్లో సర్వీసులు ప్రారంభించవద్దంటూ కోరాయి. భారీగా కరోనా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం…మరోవైపు ఇంటర్నేషనల్ సర్వీసుల పునరుద్ధరుణపై కూడా కేంద్రం  స్పందించింది..ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్ నాటికి ఇంటర్నేషనల్ సర్వీసులు రీస్టార్ట్ అవుతాయని కేంద్రమంత్రి హర్దీవ్‌సింగ్ పూరీ చెప్తున్నారు.

బుకింగ్స్ ఓపెన్ : – 
దేశీయ విమాన ప్రయాణాలకు సంబంధించి బుకింగ్స్ ను ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. సోమవారం నుంచి మూడు నెలల వరకు ప్రతి వారం 8428 విమానాలను నడపనున్నట్లు సివిల్ ఏవియేషన్ బాడీ ఇది వరకే ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. అదే విధంగా బుకింగ్స్ పునః ప్రారంభం గురించి జాతీయ క్యారియర్ అయిన ఎయిర్ ఇండియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రయాణికులకు సమాచారం ఇచ్చింది. జూన్ 30  వరకు  విమానయాన సంస్థలు నడిపే ప్లైట్‌లకు ఇప్పటికే డీజీసీఏ అనుమతి పొందాయి.

ఏవియేషన్ సెక్టార్ కు ఊరట : – 
దీని ప్రకారం…  ఎయిర్‌ ఏషియా 240 విమానాలు నడపనుంది. ఇక ఎయిర్‌ ఇండియా 340, అలయన్స్‌ ఎయిర్‌ 178, ఇండిగో 970, స్పైస్‌ జెట్‌ 434, విస్టారా 448 విమాన సర్వీసులు నడపనున్నాయి. మొత్తానికి కరోనా వైరస్ విజృంభణ తర్వాత విమాన సర్వీసులు మొత్తం రద్దు  కావడంతో కుదేలైపోయిన విమానయాన రంగ కంపెనీలు రెండు నెలల విరామం తర్వాత సర్వీసులు ప్రారంభిస్తున్నాయ్..దీంతో ఏవియేషన్ సెక్టార్ కాస్త ఊరటగా ఫీలవుతోంది..

Read: దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న ఎండలు… ఐదు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్