Donation Boxes: పాక్ సంస్థకు భారత్‌లో విరాళాల సేకరణ

ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్ హత్యతో పాక్‌కు చెందిన ఇస్లామిక్ సంస్థల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం అక్కడి సంస్థలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో మన దేశంలో పాక్ సంస్థకు విరాళాలు సేకరిస్తున్నఅంశం సంచలనంగా మారింది.

Donation Boxes: పాక్ సంస్థకు భారత్‌లో విరాళాల సేకరణ

Donation Boxes

Donation Boxes: పాకిస్తాన్‌కు చెందిన ఒక ఇస్లామిక్ సంస్థకు భారత్‌లో విరాళాలు సేకరిస్తున్న అంశం తాజాగా వెలుగు చూసింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ‘దావత్-ఇ-ఇస్లామి’ అనే సంస్థకు చెందిన ఒక డొనేషన్ బాక్స్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గుర్తించారు. అక్కడి మెడికల్ షాపులో ఈ బాక్స్ ఉంచి, దీని ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు.

Woman Suicide: మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్ హత్యతో పాక్‌కు చెందిన ఇస్లామిక్ సంస్థల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం అక్కడి సంస్థలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో మన దేశంలో పాక్ సంస్థకు విరాళాలు సేకరిస్తున్నఅంశం సంచలనంగా మారింది. పాక్ సంస్థకు చెందిన విరాళాల బాక్స్ కాన్పూర్ మెడికల్ షాపులో ఉండటంపై ఓనర్‌ ఫయాజ్‌ను ప్రశ్నించగా ‘‘మదర్సాలో చదువుకునే పిల్లల చదువు కోసం విరాళాలు సేకరించేందుకు ఒక వ్యక్తి ఇక్కడ బాక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు. అక్కడ చదువుకునే పిల్లల బట్టలు, పుస్తకాలు, ఆహారం కోసం ఆ డబ్బులు వాడుతున్నట్లు చెప్పాడు. ఈ రోజుల్లో మసీదుల్లో కూడా ఇలా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదో ట్రెండుగా మారింది. ఈ డబ్బుల్ని ఎందుకోసం వాడుతున్నారో దేవుడికే తెలియాలి’’ అని అతడు సమాధానం ఇచ్చాడు.

Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు

కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి బాక్సుల గురించి ప్రచారం జరిగితే, అప్పట్లో ఈ బాక్సుల్ని తొలగించారు. కానీ, మళ్లీ ఇప్పుడు కాన్పూర్‌లో ఇలాంటి విరాళాల బాక్సులు కనిపిస్తున్నాయి. ‘దావత్-ఇ-ఇస్లామి’ అనే సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం పాక్‌లోని కరాచీలో ఉంది. ఈ సంస్థ ఇస్లాంకు చెందిన కోర్సుల్ని నేర్పుతుంది.