ఫాస్టాగ్ లేదా.. డబుల్ టోల్ ఛార్జితో పాటు వాహనదారులకు మరో షాక్

ఫాస్టాగ్ లేదా.. డబుల్ టోల్ ఛార్జితో పాటు వాహనదారులకు మరో షాక్

Dont have FASTag pay fine: సోమవారం(ఫిబ్రవరి 15,2021) అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్(Fastag) నిబంధన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే ఎన్.హెచ్.ఏ.ఐ(NHAI) టోల్ గేట్ల దగ్గర డబుల్ టోల్ చార్జీ చెల్లించాల్సిందే అనే విషయం కూడా విదితమే. అయితే ఫాస్టాగ్ లేకపోతే ఫైన్ వేస్తారనే విషయం మీకు తెలుసా? అవును, ఫాస్టాగ్ లేకపోతే డబుల్ టోల్ చార్జి చెల్లించడమే కాదు, జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్ లేకపోవడం అంటే మోటార్ వాహన చట్టం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. దీనికి తొలిసారి రూ.300, రెండోసారి రూ.500 ఫైన్ పడుతుందని వివరించారు.

మీకు కారుందా? లేదంటై ఏదైనా ఫోర్ వీలర్ కలిగి ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా హైవేలపై వెళ్లేటప్పుడు ఫాస్టాగ్స్‌ను కలిగి ఉండాలి. ఎందుకంటే ఇకపై టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ తీసుకోరు. ఆటోమేటిక్‌గానే ఫాస్టాగ్ నుంచి టోల్ ప్లాజా చార్జీలు కట్ అవుతాయి. టోల్ ప్లాజాల ద్వారా వెళ్లే అన్ని వాహనాలకు ఇది వర్తిస్తుంది.

టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా అంటే టైమ్ వేస్ట్ కాకుండా, అలాగే భారీ రద్దీని తొలగిచేందుకు, సులభతర చెల్లింపుల కోసం తీసుకొచ్చిన విధానమే ఫాస్టాగ్. బార్ కోడ్ తరహాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్టాగ్ అంటారు. ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ ప్లాజాల దగ్గర రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు. సోమవారం(ఫిబ్రవరి 15,2021) అర్థరాత్రి నుంచి పూర్తిస్థాయిలో ఫాస్టాగ్ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇక, టోల్ గేట్ల దగ్గర నగదు చెల్లింపులు ఉండవు. ఫాస్టాగ్ లేని వారికి ప్రత్యేక లేన్లు ఏమీ ఉండవు.