cm father:బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించండి..లేదా..నా మరణానికి అనుమతి ఇవ్వండి: రాష్ట్రపతికి సీఎం తండ్రి లేఖ

ఈవీఎంలు వినియోగించవద్దు.. బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించడి..లేదా..నా మరణానికి అనుమతి ఇవ్వండి ఛత్తీస్ గఢ్ సీఎం తండ్రి నందకుమార్ రాష్ట్రపతికి లేఖ రాశారు.

cm father:బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించండి..లేదా..నా మరణానికి అనుమతి ఇవ్వండి: రాష్ట్రపతికి సీఎం తండ్రి లేఖ

Chhattisgarh Cm Father Nandakumar letter To The President

chhattisgarh cm father nandakumar Letter to the President : ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దని..బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలని లేదంటే తను మరణించటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ తండ్రి నందకుమార్‌ బఘేల్‌ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ఇప్పటికే పలు రకాల విమర్శలు ఉన్నాయి. మరెన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలే దేశంలో జరిగే ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించొద్దని..బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించాలని సీఎం భూపేశ్‌ బఘేల్‌ తండ్రి నందకుమార్‌ బఘేల్‌ డిమాండ్‌ చేశారు.

Read more : CM Father arrest బ్రాహ్మణులపై సీఎం తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. అరెస్ట్!

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు నందకుమార్ లేఖ రాశారు. లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు. ఓటర్లను జాగృతం చేసే ‘రాష్ట్రీయ మత్‌దాతా జాగృతి మంచ్‌’ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సీఎం తండ్రి నందకుమార్‌ రాష్ట్రపతికి రాసిన లేఖలో ‘పౌరుల రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయి. ఈ దేశ పౌరుల్లో భయం పెరుగుతోంది’ అని పేర్కొన్నారు. ‘ఇటువంటి వ్యవస్థలో నాకు బతకాలని లేదు. రాష్ట్రపతీజీ! మీరు రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేశారు. నా రాజ్యాంగ హక్కులకు రక్షణ లేదు. కాబట్టి, నాకు మరణం తప్ప మరో మార్గం లేదు. జాతీయ ఓటరు దినోత్సవం రోజు అంటే జనవరి 25న నా అనాయాస మరణానికి అనుమతైనా ఇవ్వండి’ అంటూ లేఖలో రాష్ట్రపతిని కోరారు నందకుమార్.

ఒక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడారన్న అభియాగంపై గత సెప్టెంబరులో నందకుమార్‌ బఘేల్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. నంద కుమార్ ‘‘ బ్రాహ్మణులు బయటివారని, విదేశీయులని, వారు తమను తాము సంస్కరించుకోవాలని..లేదంటే గంగ నుంచి వోల్గాకు వెళ్ళడానికి సిద్ధం కావాలని నంద కుమార్ వ్యాఖ్యానించారని తమ అవమానించారని ఆరోపిస్తున్నారని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Read more : Imran Khan: పాక్ ఆర్థిక వ్యవస్థ ఇండియా కంటే బెటర్‌గానే ఉంది: ఇమ్రాన్ ఖాన్

దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి..కోర్టులో హాజరుపరిచారు. ఆరోపణలపై విచారించిన కోర్టు ఆయనను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. సీఎం భూపేష్ స్పందిస్తూ తనకు తన తండ్రి అంటే గౌరవం ఉందనీ..కానీ తన ప్రభుత్వంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదని చెప్పారు. ఓ కుమారునిగా తాను తన తండ్రిని గౌరవిస్తానన్నారు. కానీ ప్రజా భద్రతకు భంగం కలిగించే ఆయన పొరపాట్లను ఉపేక్షించరాదని అన్న విషయం తెలిసిందే.