Vikram Doraiswami: యూకేలో భారత రాయబారిగా దొరైస్వామి

యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు సంబంధించి భారత రాయబారిగా నియమితులయ్యారు విక్రమ్ దొరైస్వామి. ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా ఉన్నారు. త్వరలోనే ఆయన యూకేలో అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.ambassador to UK

Vikram Doraiswami: యూకేలో భారత రాయబారిగా దొరైస్వామి

Vikram Doraiswami

Vikram Doraiswami: యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు సంబంధించి భారత రాయబారిగా నియమితులయ్యారు విక్రమ్ దొరైస్వామి. ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా ఉన్నారు. త్వరలోనే ఆయన యూకేలో అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం యూకేలో రాయబారిగా ఉన్న గైత్రి ఇస్సార్ కుమార్, గత జూన్ 30న రిటైర్ అయ్యారు. దీంతో ఇస్సార్ స్థానంలో విక్రమ్ దొరైస్వామి బాధ్యతలు చేపడతారు. దొరైస్వామి 1992 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఆయన చైనీస్ భాష కూడా మాట్లాడగలరు. ఇంతకుముందు ఉజ్బెకిస్తాన్, దక్షిణ కొరియా, అమెరికాల్లో భారత రాయబారిగా పనిచేశారు. ప్రధానికి ప్రైవేటు సెక్రటరీగా కూడా సేవలందించారు.

Raghunandan Rao: తెలంగాణకు మేమున్నాం అని భరోసా ఇస్తాం: ఎమ్మెల్యే రఘునందన్ రావు

విక్రమ్ దొరైస్వామి బదిలీతో ఖాళీ అవ్వనున్న బంగ్లాదేశ్ రాయబారి స్థానాన్ని సుధాకర్ దలేలా భర్తీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సుధాకర్ అమెరికాలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌లో పనిచేస్తున్నారు. మరోవైపు వియత్నాంలో భారత రాయబారిగా ఉన్న ప్రణయ్ వర్మ భూటాన్ రాయబారిగా వెళ్లనున్నారు. భూటాన్ రాయబారిగా ఉన్న రుచిరా కంబోజ్ ఐరాసలో భారత ప్రతినిధిగా సేవలందించనున్నారు. వియత్నాంలో ప్రణయ్ వర్మ స్థానంలో సందీప్ ఆర్య భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నియామకాలకు సంబంధించి కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.