DRDO Launch 2-DG Drug: కరోనాకు కొత్త మందు.. వచ్చే వారమే మార్కెట్లోకి 2-డీజీ డ్రగ్!

వేరియంట్ల మీద వేరియంట్లు రూపాంతరాలు చెందుతుంటే మన వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా మహమ్మారి అంతం చూసేందుకు నిరంతరం అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కొన్ని Vaccines అందుబాటులోకి రాగా.. వైరస్ మీద పోరాడేందుకు ఎన్నో Medicines మార్కెట్లోకి వచ్చాయి.

DRDO Launch 2-DG Drug: కరోనాకు కొత్త మందు.. వచ్చే వారమే మార్కెట్లోకి 2-డీజీ డ్రగ్!

Drdo Launch 2 Dg Drug

DRDO Launch 2-DG Drug: Corona వేరియంట్ల మీద వేరియంట్లు రూపాంతరాలు చెందుతుంటే మన వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా మహమ్మారి అంతం చూసేందుకు నిరంతరం అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కొన్ని Vaccines అందుబాటులోకి రాగా.. వైరస్ మీద పోరాడేందుకు ఎన్నో Medicines మార్కెట్లోకి వచ్చాయి. అయితే.. ఇవన్నీ మాత్రలు, ఇంజక్షన్ల రూపంలోనే ఇప్పటి వరకు అందుబాటులో ఉండగా ఇవి వాడకం, లభ్యం కాస్త కష్టంగా మారింది. అయితే, ఇప్పుడు మహమ్మారి పనిబట్టే పౌడర్ అందుబాటులోకి రానుంది.

నీళ్లలో కలుపుకొని తాగేలా చిన్న సాచెట్ ల రూపంలో 2-Deoxy-D-glucose (2-DG) అనే కరోనా మందు అందుబాటులోకి రానుందని గత రెండు వారాలు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. మరో వారం రోజులలోనే ఈ డ్రగ్ మార్కెట్లో అందుబాటులోకి రానుందట. డాక్టర్ అనంత నారాయణ భయ్ సహా కొంతమంది భారత రక్షణ, అభివృద్ధి సంస్థ (DRDO) సైంటిస్టులు కలిసి ఉత్పత్తి చేసిన 2-Deoxy-D-glucose (2-DG) మందును వచ్చే వారం ప్రారంభించబోతున్నట్లు సాక్షాత్తు DRDO తెలిపింది. కాగా, మొదటి బ్యాచ్‌లో 10,000 డోసుల 2-DGని కరోనా సోకిన పేషెంట్లకు వచ్చేవారం ఇవ్వబోతున్నారు.

మరోవైపు 2-DG డ్రగ్ ను భారీ ఎత్తున ఉత్పత్తి చెయ్యడానికి ఫార్మా కంపెనీలు రెడీ అవుతున్నాయి. Dr. Reddy’s Laboratories‌ సహకారంతోనే DRDOలోని Nuclear Medicine, Allied Sciences Lab Institute ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేయగా ఇప్పుడు భారీ ఎత్తున ఉత్పత్తి చేయడంలో కూడా Dr. Reddy’s Laboratories‌తో పాటు మరికొన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. కాగా, ఈ మందు కరోనా సోకిన వారికి వ్యాధి తీవ్రత మధ్యస్థాయిలో లేక తీవ్ర స్థాయిలో ఉన్న వారికి ఇస్తారు. దీని ద్వారా పేషెంట్లు త్వరగా రికవరీ అవడంతో పాటు ఆక్సిజన్‌పై ఆధారపడే అవకాశాలను తగ్గిస్తోందని DRDO ధీమా వ్యక్తం చేస్తుంది.