Water Problem : తాగునీటి కష్టాలు..60 అడుగుల లోతు బావిలో దిగి నీటిని తీసుకెళ్తున్న మహిళలు

దిండోరిలో ప్రతిరోజూ హృదయాల్ని కదిలించే ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తాయి. అడుగంటిపోతున్న నీళ్లను తోడుకోవడానికి వాళ్లు పడుతున్న పాట్లు చూశాక కూడా అధికారులకు, ప్రభుత్వాలకు జాలి కలగట్లేదు.

Water Problem : తాగునీటి కష్టాలు..60 అడుగుల లోతు బావిలో దిగి నీటిని తీసుకెళ్తున్న మహిళలు

Water Problem

Drinking water problem : కూటి కోసం కోటి తిప్పలు అంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో నీటి కోసం కూడా మహిళలు ముక్కోటి తిప్పలు పడుతున్నారు. కొన్ని మారుమూల గ్రామాల్లో తాగునీటి సమస్య మరీ దారుణంగా తయారైంది. గుక్కెడు నీళ్లకోసం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా మహిళలు నీళ్ల కోసం ఫీట్లు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో తాగునీటికి కటకటగా ఉంది. ఇంటిల్లిపాది కడుపు నింపాలి.. వారి దాహం తీర్చాలంటే.. ఆ ఇంటి ఇల్లాలు ప్రాణాలకు తెగించి ఆ బావిలోకి దిగాల్సిందే. ఏళ్ల తరబడగా ఇదే జరుగుతోంది. ఏకంగా 60 అడుగుల లోతున్న బావిలో ప్రతీరోజూ ఫీట్లు చేస్తూ ఆ మహా ఇల్లాళ్లు నీటిని తీసుకువెళ్తారు.

Rains And Floods : సీమ జిల్లాల్లో జల విలయంతో ప్రయాణికుల కష్టాలు

దిండోరిలో ప్రతిరోజూ హృదయాల్ని కదిలించే ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తాయి. అడుగంటిపోతున్న నీళ్లను తోడుకోవడానికి వాళ్లు పడుతున్న పాట్లు చూశాక కూడా అధికారులకు, ప్రభుత్వాలకు జాలి కలగట్లేదు. దీంతో దిండోరి ప్రాంతంలో మహిళలకు తిప్పలు తప్పట్లేదు.