కరోనా యోధులకు వైరస్ ఎలా వస్తుందో తెలుసా ? 

  • Published By: madhu ,Published On : June 26, 2020 / 02:57 AM IST
కరోనా యోధులకు వైరస్ ఎలా వస్తుందో తెలుసా ? 

కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్న యోధులకు (డాక్టర్స్, వైద్యులు, ఇతర సిబ్బంది)కి ఎలాంటి ఇబ్బంది లేదా ? వారు ఆరోగ్యంగానే ఉంటున్నారా ? అంటే కాదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వారికి కూడా వైరస్ సోకుతోంది.

ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా…వారు కూడా అనారోగ్యానికి గురి కావడం..చనిపోవడం ఘటనలతో భయాందోళనలు నెలకొన్నాయి. కానీ..రోగి నుంచి వైరస్ సోకుతుందని అందరూ భావించారు. అది నిజం కాదంటోంది అమెరికా డ్యూక్ యూనివర్సిటీ.

వారు చేసిన అధ్యయనంలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 15వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు జరిపిన ఈ పరిశోధనలో 21 వేల 104 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా వైరస్‌ సోకిన విధానంపై అధ్యయనం చేశారు. 

రోగులకు చికిత్స అందిస్తున్న క్రమంలో వారు పీపీఈ కిట్స్ ధరించడం, గ్లౌజ్ లు వేసుకోవడం, మాస్క్ లు పెట్టుకోవడం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో వారి నుంచి వైరస్ సోకడం లేదని గుర్తించారు వారు.

చికిత్స చేసిన అనంతరం వారి వారి గదుల్లోకి వెళ్లిన తర్వాత..పీపీఈ కిట్స్, గ్లౌజ్, మాస్క్ లు తీసివేస్తున్నారని, ఇతరులతో కనీసం భౌతిక దూరం పాటించకుండా..మాట్లాడుతుండడంతో వారికి వైరస్ సోకుతోందని గుర్తించారు. సమాజం నుంచి, సహచరుల నుంచి, ఆస్పత్రుల నుంచి సోకుతున్నట్లు నిర్ధారించి ఆమేరకు విభజన చేసి పరిశోధన సాగించారు.

హెల్త్‌ వారియర్స్‌కు సోకుతున్న వైరస్‌ ప్రధానంగా 38 శాతం సమాజం నుంచే సోకుతుండగా.. మరో 22 శాతం మేర ఆస్పత్రుల నుంచి సోకుతుంది. మిగతా 40 శాతం మందికి సమాజం, ఆస్పత్రులతో పాటు ఇతర అంశాల వల్ల వైరస్‌ వ్యాప్తి చెంది ఉండవచ్చని అభిప్రాయపడింది. ఇక ఆస్పత్రి ద్వారా కరోనా సోకిన వారిలో 70 శాతం మందికి కేవలం సహోద్యోగుల వల్లే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.

Read: పాప్ సంగీతపు రారాజు : Michael Jackson’s Death Anniversary