Mobile Phones: ఉద్యోగులు పని సమయాల్లో మొబైల్ ఫోన్లు వాడటానికి వీల్లేదు- మద్రాస్ హైకోర్టు

మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలిచ్చింది. పని సమయాల్లో మొబైల్ ఫోన్లను పర్సనల్ యూజ్ కోసం వాడొద్దని అందులో సూచించింది. వర్క్ ప్లేస్‌లో మొబైల్ ఫోన్..

Mobile Phones: ఉద్యోగులు పని సమయాల్లో మొబైల్ ఫోన్లు వాడటానికి వీల్లేదు- మద్రాస్ హైకోర్టు

Madras Hc

Mobile Phones: మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలిచ్చింది. పని సమయాల్లో మొబైల్ ఫోన్లను పర్సనల్ యూజ్ కోసం వాడొద్దని అందులో సూచించింది. వర్క్ ప్లేస్‌లో మొబైల్ ఫోన్ వాడినందుకు గానూ సస్పెన్షన్‌కు గురైన వ్యక్తి పిటిషన్‌ తరపు వాదనను జస్టిస్ ఎస్ఎమ్ సుబ్రహ్మణ్యం విన్నారు.

దానిపై స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులు పని గంటల్లో ఫోన్ వాడటం నార్మల్ అయిపోయిందని అన్నారు. పని గంటల్లో ఇలాంటి చర్యలకు పాల్పడటం కరెక్ట్ కాదని సూచించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఈ చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు తగిన యాక్షన్ తీసుకునేలా ప్రక్రియ మొదలుపెట్టాలని కోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తి స్థాయి వివరణతో కూడి రిపోర్ట్ సబ్‌మిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

Read Also : మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలి