Dutch MP: నుపుర్ శర్మ వివాదం.. భారత్‌కు డచ్ ఎంపీ మద్దతు

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మతోపాటు భారత్‌కు మద్దతు ప్రకటించాడో డచ్ ఎంపీ. ఆమెకు మద్దతుగా నిలబడాలంటూ పిలుపునిచ్చాడు. నెదర్లాండ్స్‌కు చెందిన గీర్ట్ వైల్డర్స్ అనే ఎంపీ తాజా వివాదంపై స్పందిస్తూ ట్వీట్లు చేశాడు.

Dutch MP: నుపుర్ శర్మ వివాదం.. భారత్‌కు డచ్ ఎంపీ మద్దతు

Dutch MP: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మతోపాటు భారత్‌కు మద్దతు ప్రకటించాడో డచ్ ఎంపీ. ఆమెకు మద్దతుగా నిలబడాలంటూ పిలుపునిచ్చాడు. నెదర్లాండ్స్‌కు చెందిన గీర్ట్ వైల్డర్స్ అనే ఎంపీ తాజా వివాదంపై స్పందిస్తూ ట్వీట్లు చేశాడు. ఈ సందర్భంగా తీవ్రవాదులకు తల వంచొద్దని భారత్‌కు సూచించాడు.

Cheetah: భారత్‌ రానున్న చీతాలు.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి

‘‘ఆల్ ఖైదా వంటి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు తల వంచొద్దు. వాళ్లు అనాగరికులకు ప్రతీక. భారతీయులంతా నుపుర్ శర్మకు శక్తినిచ్చి, మద్దతుగా నిలబడాలి. ఆల్ ఖైదా సంస్థ, తాలిబన్లు నన్ను ఎప్పుడో వాళ్ల హిట్ లిస్టులో చేర్చుకున్నారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే.. తీవ్రవాదులకు ఎప్పటికీ తల వంచకూడదు’’ అని గీర్ట్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు. ఆమె వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, దీనిపై ఇస్లామిక్ దేశాలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు. దీనిపై భారత్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నుపుర్ శర్మకు మద్దతుగా నిలబడినందుకు అందరూ గర్వ పడాలి. ఇస్లామిక్ దేశాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు. చట్టం, స్వేచ్ఛ వంటివి కనిపించవు. మైనారిటీలను హింసిస్తూ, మానవ హక్కులను కాలరాస్తుంటారు’’ అని గీర్ట్ వైల్డర్స్ ట్వీట్ చేశారు.

BAIL: పోడు భూముల కేసు.. ఆదివాసి మహిళలకు బెయిల్, విడుదల

గీర్ట్ నెదర్లాండ్స్‌లో ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన పార్టీ ఆఫ్ ఫ్రీడమ్ అనే పార్టీని స్థాపించాడు. ఇది నెదర్లాండ్స్‌లో మూడో అతిపెద్ద పార్టీ. తాజా వివాదంలో నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ అంశంపై ఇస్లామిక్ దేశాలు భారత్‌ను విమర్శిస్తున్నాయి. అల్ ఖైదా వంటి సంస్థలు దేశంలో దాడులకు తెగబడతామని హెచ్చరిస్తున్నాయి.