రెడ్ జోన్లలోనూ ఈ కామర్స్ ‘నాన్-ఎసెన్షియల్స్’ డెలివరీకి అనుమతి 

  • Published By: srihari ,Published On : May 18, 2020 / 05:41 AM IST
రెడ్ జోన్లలోనూ ఈ కామర్స్ ‘నాన్-ఎసెన్షియల్స్’ డెలివరీకి అనుమతి 

కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ కామర్స్ కంపెనీలకు ఊరట లభించింది. ఇకపై రెడ్ జోన్లలోనూ నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటివరకూ కంటైన్మెంట్ జోన్లు బయట మాత్రమే నిత్యావసర, నిత్యావసరేతర సరుకులను డెలివరీ చేసేందుకు అనుమతి  ఉండేది. ఇప్పటినుంచి రెడ్ జోన్లలో కూడా నిత్యావసరేతర సరకుల డెలివరీకి అనుమతినిచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోనూ నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమితినిచ్చింది. దేశవ్యాప్తంగా మూడోసారి లాక్ డౌన్ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 

ఈ లాక్ డౌన్ అన్ని జోన్లకు వర్తించనుంది. దేశంలో కరోనా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఆన్ లైన్ సేల్స్ విషయంలో కఠినమైన ఆంక్షలు అలానే కొనసాగనున్నాయి. నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతి ఉన్న జోన్లలో కూడా ఇదే తరహా ఆంక్షలు వర్తించనున్నాయి. కంటైన్మెంట్ జోన్లను కఠినంగా నిర్వహించనున్నారు. అత్యవసర వైద్య సాయం, నిత్యావసర వస్తువుల పంపిణీకి సంబంధించి మినహా ఇతరులు ఎవరూ బయట తిరగడానికి అనుమతి లేదు. ప్రత్యేకించి నిషేధించిన సర్వీసులు మినహా అన్ని కార్యకలాపాలను రెడ్, గ్రీన్, ఆరెంజ్, బఫర్ జోన్లలోనూ నిర్వహించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేసింది. 

కంటైన్మెంట్ జోన్లలో మినహా ఇతర అన్ని జోన్లలో సెలూన్లు తెరుచుకోవచ్చు. అది కూడా ఆయా రాష్ట్రాలు అనుమతినిస్తే అనే విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏదిఏమైనా సెలూన్లు, మాల్స్ తెరిచేందుకు అనుమతి లేదు. మూడో దశ లాక్ డౌన్ సమయంలో బార్బర్ షాపులు, సెలూన్లను కూడా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో తెరిచేందుకు అనుమతి ఉంది. మార్చి 25 లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతి ఉంది. నాన్ ఎసెన్షియల్ వస్తువులకు డెలివరీ చేసేందుకు ఈ కామర్స్ ప్లాట్ ఫాంలకు అనుమతి లేదు. 

Read Here>>సాఫ్ట్ బ్యాంకు బోర్డు నుంచి అలీబాబా జాక్‌మా రిజైన్