Breaking News : మిజోరాంలో భూకంపం

  • Published By: madhu ,Published On : June 22, 2020 / 05:32 AM IST
Breaking News : మిజోరాంలో భూకంపం

భారతదేశంలో వరుస భూకంపాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవలే పలు రాష్ట్రాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దేశ రాజధానిలో భూకంపం సంభవించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న తరుణంలో 2020, జూన్ 22వ తేదీ సోమవారం మిజోరాంలో భూకంపం సంభవించింది.

ఉదయం 4 గంటల సమయంలో వచ్చిన ఈ ప్రకంపనాలు రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. చాంపైకి నైరుతి దిశలో భూకంప తీవ్రతగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. విషయం తెలుసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..మిజోరాం సీఎంతో మాట్లాడారు. కేంద్రం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆస్తి, ప్రాణ నష్టం సంబంధించిన వివరాలు తెలవాల్సి ఉంది.

మిజోరాం రాజధాని అయిన..ఐజ్వాల్ లో 2020, జూన్ 21వ తేదీ ఆదివారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని తీవ్రత 5.1గా ఉంది. మిజోరంకు 9 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని మణిపూర్‌ యూనివర్సిటీ భూ విజ్ఞాన శాస్త్ర విభాగం వెల్లడించింది.

ఇటీవలే పలు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఆదివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జూన్ 18వ తేదీన ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 2.6గా నమోదయ్యింది. 

Read: ఇండో-చైనా సైనికుల ఘర్షణ తర్వాత అద్భుతంగా మాట్లాడారు, ప్రధాని మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం