Ghee And Banana : నెయ్యి, అరటి పండు కలిపి తీంటే!

నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచ‌దు. మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

Ghee And Banana : నెయ్యి, అరటి పండు కలిపి తీంటే!

Banana, Ghee

Ghee And Banana : అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అనేక పోషకాలున్న అరటి పండు తినటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. తక్షణ శక్తిని ఇవ్వటంలో అరటిపండును మించింది లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పోషకాలకు నిలయమైన అరటిపండును, నెయ్యితో కలిపి తినడం వల్ల ఇంకా ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అరటి పండు, నెయ్యిల ద్వారా మన శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. రోజూ ఉదయాన్నే ఈ రెండింటినీ కలిపి తింటే అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, మలబద్దకం, అసిడిటీ తగ్గుతాయి. తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. విట‌మిన్ ఎ పుష్క‌లంగా ల‌భించి తద్వారా నేత్ర స‌మ‌స్య‌లు పోతాయి.

అరటి పండు, నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల చర్మానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇలా తీసుకోవడం వల్ల చర్మంలో ఉండే సహజ కాంతి బయటకు వస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా రోజూ అరటిపండ్లు, నెయ్యి తీసుకోవాలి. శృంగార సామర్థ్యం పెరిగి శృంగార సమస్యలు తొలగిపోతాయి. వీర్యం అధికంగా ఉత్పత్తి అవ్వటంతోపాటు సంతాన సమస్యలు తీరతాయి. కండరాలు దృఢంగా మారుతాయి. కండరాలు నిర్మాణమై చక్కని శరీరాకృతిని పొందుతారు. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో అరటి, నెయ్యిల మిశ్రమం అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచ‌దు. మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మ‌డ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది. శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నెయ్యిలో ఉండే విట‌మిన్ డి ఎముక‌లకు మేలు చేస్తుంది. ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి.

ఇక అరటి పండు, నెయ్యి మిశ్రమాన్ని ఇలా తయారికి సంబంధించి ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో 2 టీస్పూన్ల నెయ్యి వేయాలి. తరువాత బాగా పండిన 2 అరటి పండ్లు గుజ్జుగా చేసుకోవాలి. ఆ రెండింటిని బాగా కలపాలి. మెత్తని గుజ్జులా తయారైన తరువాత రోజూ ఉదయాన్నే పరగడుపునే తినాలి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనం చేకూరుతుంది.