Hair Fall : చేప,చక్కర, గుడ్డు తెల్లసొన అధికంగా తింటున్నారా! అయితే అది రావటం ఖాయం?

అతిగా చేపలు పట్టడం వల్ల చేపల్లో మిథైల్‌ మెర్క్యూరీ సాంద్రత పెరిగి, వీటిల్లో పాదరసం అత్యధికంగా బహిర్గతం అవుతుంది. సాధారణంగా సముద్ర చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. శరీరంలో పాదరసం స్థ

Hair Fall : చేప,చక్కర, గుడ్డు తెల్లసొన అధికంగా తింటున్నారా! అయితే అది రావటం ఖాయం?

Hair

Hair Fall : కొంత మందికి కొన్ని రకాల పదార్దాలంటే చాలా ఇష్టం. అలాంటి వాటిని ఇష్టంతో మోతాదుకు మించి అతిగా లాంగించేస్తుంటారు. ఇలా చేయటం ద్వారా తరువాత కాలంలో వివిధ రకాల రిస్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని వారికి ఏమాత్రం తెలియదు. అయితే కొన్ని రకాల ఆహారాలను పరిమితంగానే తీసుకోవాలి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి జాగ్రత్తలు పాటించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, ఊబకాయానికి దారితీసే ఇన్సులిన్ బట్టతలకు కూడా కారణమవుతుందట. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. చక్కెరలో, పిండిపదార్థాల్లో, రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్లలలో ఇన్సులిన్‌ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా హానికలిగిస్తాయి. జుట్టు రాలడానికి కారణమయ్యే ఆండ్రొజెన్స్‌, ఇన్సులిన్‌ పెంపుకు కారణమౌతాయి

శుద్ధిచేసిన పిండి, బ్రెడ్‌, చక్కెరలలో జీఐ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతౌల్యానికి దారితీసేలా చేస్తాయి. ఆల్కహాల్‌ అధికమోతాదులో తీసుకుంటే పోషకాల అసమతుల్యతకు కారణమౌతుంది. ఒక్కోసారి కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోయి శాశ్వతంగా జుట్టు రాకుండా నిరోధిస్తుంది. ఐతే ఆల్కహాల్‌ కెరటీన్‌పై దుష్ప్రభావాన్ని చూపి వెంట్రుకలు బలహీనపడేలా చేస్తుంది. కెరటీన్‌ అనే హార్మోన్‌ నుంచి గోళ్లు, వెంట్రుకలు తయారవుతాయి.

అతిగా చేపలు పట్టడం వల్ల చేపల్లో మిథైల్‌ మెర్క్యూరీ సాంద్రత పెరిగి, వీటిల్లో పాదరసం అత్యధికంగా బహిర్గతం అవుతుంది. సాధారణంగా సముద్ర చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. శరీరంలో పాదరసం స్థాయిలు పెరిగితే హఠాత్తుగా జుట్టు రాలటం జరుగుతుంది. జంక్ ఫుడ్ వల్ల కూడా జుట్టుకు నష్టం జరుగుతుంది. మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు జంక్‌ ఫుడ్‌లో ఎక్కువ మోతాదులో ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలకు, ఉబకాయానికి, జుట్టు రాలడానికి కారణమౌతాయి. వెంట్రుకల కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి.

జుట్టు ఆరోగ్యానికి గుడ్డు ఎంతో సహాయపడుతుంది. ఐతే గుడ్లులోని తెల్లసొనను పచ్చిగా తింటే బయోటిన్‌ డెఫీషియన్సీకి గురయ్యేలా చేస్తుంది. కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడే విటమిన్ ఇది. ఇది లోపిస్తే జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. డైట్ సోడాలో ఎస్పర్టెమ్‌ అనే ఆర్టిఫీషియల్‌ స్వీట్నర్ ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుందని పరిశోధకులు గుర్తించారు. మీరు ఇప్పటికే జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటే డైట్‌ సోడాను పూర్తిగా మానెయ్యడం మంచిది.