Eating An Apple : ప్రతిరోజు ఒక యాపిల్ తింటే చాలు.. శరీర ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

ఆపిల్ మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా సహాయ పడుతుంది. ఈ కాలంలో ఎక్కువ మోతాదులో మనుషులు చనిపోయే వ్యాధులలో గుండె కు సంబంధించిన వ్యాధి ఒక పెద్ద కారణం అని చెప్పవచ్చు. మన డైట్ లేదా రోజు మనం తినే ఆహార పదార్థాలు కూడా గుండె కు సంబంధిన వ్యాధులలో పెద్ద పాత్రను పోషిస్తాయి.

Eating An Apple : ప్రతిరోజు ఒక యాపిల్ తింటే చాలు.. శరీర ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Eating an apple every day (1)

Eating An Apple : ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు, రోజుకు ఒక యాపిల్ తింటే ఆరోగ్యపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండులో విటమిన్ ఏ, సి, క్యాల్షియం, పొటాషియం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. యాపిల్‌లో ఫైబర్‌ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. యాపిల్ పండ్లను ప్రతి రోజు తీసుకుంటుంటే క్యాన్సర్, మధుమేహం, గుండెకు సంబంధించిన జబ్బులు, అల్జీమర్స్‌లాంటి వ్యాధులు రావు.

యాపిల్ పండును తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇతర ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలకన్నా యాపిల్ పండ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఎక్కువఆపిల్ లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్త కణాలని మరియు నాడీ వ్యవస్థ మెరుగుదల కి దోహద పడుతుంది. ఇంతే కాకుండా ఆపిల్ లో ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల రోగాలు దరిచేరవు.

మెదడు తీరుని మెరుగుపరుస్తుంది : చిన్న పిల్లలు ఏదైనా చూసిన విన్నా త్వరగా గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది,కాని అదే వయసు పై బడిన వారి లో జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గి పోతూ ఉంటుంది. అయితే ఆపిల్ తినే వారిలో మాత్రం మెదడు కి సంభందించిన రోగాల నుండి కాపాడుతుందని చెప్పొచ్చు.

జీర్ణ సమస్యలు : రోజు ఒక ఆపిల్ పండు తినడం వలన హెలికోబాక్టర్ పైలోరీ అనే బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే గ్యాస్ట్రిక్ అల్సర్ జీర్ణాశయంలో కలిగే పుండు నుంచి కాపాడుతుంది. ఇదే కాకుండా శరీరంలో ఏర్పడే మ్యుటేషన్స్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారి నుంచి కూడా కాపాడే అవకాశాలు ఉన్నాయి.

శరీరం లోని కొవ్వు ని తగ్గిస్తుంది : మనలో చాలా మంది జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు ఫలితంగా శరీరంలో కొవ్వు బాగా పెరుగుతుంది. ఇలా పెరిగిన కొవ్వు గుండె పోటు కి కూడా దారి తీయవచ్చు. ఆపిల్ తినడం వల్ల శరీంలో మరియు రక్తం లోని కొవ్వు నియంత్రణలో ఉంటుంది.

గుండె ఆరోగ్యం : ఆపిల్ మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా సహాయ పడుతుంది. ఈ కాలంలో ఎక్కువ మోతాదులో మనుషులు చనిపోయే వ్యాధులలో గుండె కు సంబంధించిన వ్యాధి ఒక పెద్ద కారణం అని చెప్పవచ్చు. మనం తినే ఆహార పదార్థాలు కూడా గుండె కు సంబంధిన వ్యాధులలో పెద్ద పాత్రను పోషిస్తాయి.

మలబద్దకం సమస్యలు : కొంత మందికి మలం సరిగా రాదు, వచ్చినట్లు అనిపిస్తుంది కాని రాదు ఇలాంటి వారు ఆపిల్ తిన్నట్లైతే మలబద్దకం సమస్య ఉండదు. ఆపిల్ లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ శరీరంలో జీర్ణ సమస్యలను నివారించడంలో దోహదపడుతుంది.

ఎముకల సామర్థ్యం : మన వయసు పెరిగే కొద్దీ మన ఎముకల సామర్థ్యం తగ్గుతుంది, నేల పై కూర్చోవడం కూడా కష్టంగా మారుతుంది అందుకే చాలా మంది కుర్చీల పైనే కూర్చోవడానికి ఇష్టపడతారు. ఎముకలను దృడంగా ఉంచుకోవడానికి రోజు ఒక ఆపిల్ తినడం వలన ఎములకు శక్తినిస్తుంది.

ఆస్థమా : మనం తినే ఆహారంలో సరైన మోతాదులో అంటి యాక్సిడెంట్ లు లేకపోవటం వల్ల ఆస్థమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. మహిళలపై చేసిన ఒక పరిశోధన లో ఆపిల్ పండు ఆస్థమా తీవ్రతను తగ్గించినట్లు గమనించటం జరిగింది. 31 గ్రాముల కన్న ఎక్కువగా ఆపిల్ తిన్న వారిలో ఆస్థమా వచ్చే అవకాశాన్ని తగ్గించింది.

క్యాన్సర్ నివారణ : ప్రపంచంలో మనుషుల చావుకు కారణమయ్యే వ్యాధులలో కాన్సర్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. మంచి డైట్ మరియు పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు కాన్సర్ నుంచి కాపాడే అవకాశాలు ఉన్నాయి. ఆపిల్ పండు పెద్ద ప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ను కూడా తగ్గిస్తుంది.