Good Eating Times : నైట్ డ్యూటీ చేసినా.. పగలు తినడమే ఆరోగ్యానికి మంచిది

గతంలో పగటి వేళల్లోనే కార్యాలయాలు ఉండేవి.. కానీ నేటి పోటీ ప్రపంచంలో మనుగడ సాగించేందుకు అనేక కంపెనీలు 24 గంటలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Good Eating Times : నైట్ డ్యూటీ చేసినా.. పగలు తినడమే ఆరోగ్యానికి మంచిది

Good Eating Times

Good Eating Times : కాలానుగుణంగా పనివేళలు మారుతూ వస్తున్నాయి. గతంలో పగటి వేళల్లోనే కార్యాలయాలు ఉండేవి.. కానీ నేటి పోటీ ప్రపంచంలో మనుగడ సాగించేందుకు అనేక కంపెనీలు 24 గంటలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు రాత్రి వేళల్లో కూడా పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా రాత్రి వేళల్లో పనిచేసేవారికి కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. వీరు పగటి సమయంలో ఎక్కువ నిద్రపోవడం వలన వీరి దినచర్య మారిపోతుంది. దీంతోపాటు ఆహారం తీసుకునే సమయాల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రి షిఫ్ట్ చేసే సమయంలో ఎక్కువగా నైట్‌టైమ్ ఆహారం తీసుకుంటున్నారు. కాలక్రమంలో మధుమేహం, గుండె సంబంధిత రోగాల బారిన పడుతున్నారు.

చదవండి : Leftover Food To The Needy : పెళ్లిలో మిగిలిపోయిన ఫుడ్‌‍ని పేదలకు పంచిన మహిళ

ఈ అంశాలపై అమెరికాలోని నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్ స్టిట్యూట్ (National Heart, Lung and Blood Institute) శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఆరోగ్యవంతులైన ఏడుగురు మహిళలు 12 మంది పురుషులకు నెల రోజుల వ్యవధిలో వేరు వేరు సమయాల్లో ఆహారం ఇచ్చి చూశారు. ఆహార సమయాల్లో మార్పులు చోటుచేసుకోవడంతో వారి జీవనగాడియారంపై మార్పులు చూపాయి. రాత్రి వేళల్లో ఆహారం తీసుకున్న వారిలో గ్లూకోజ్ స్థాయిలు అధికమైనట్లు గుర్తించారు. ఇది గుండెపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని తేల్చారు. రాత్రి పనివేళలు ఉన్న పగటి పూట తినడమే మంచిదని పరిశోధకులు తెలిపారు. ఇక ఈ అంశంపై మరింత లోతైన పరిశోధన చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

చదవండి : Nutrients Food : వయస్సు అర్ధ సెంచరీ దాటిందా?…మీరు తినాల్సిన పోషకాహారాలు ఇవే!

సాధారణంగా అయితే బ్రేక్ ఫాస్ట్ ఉదయం లేచిన 30 నుంచి 45 నిమిషాల మధ్యలో తినాలి. సమయం ప్రకారం చూస్తే.. ఉదయం 7.30 టిఫిన్ చేయాల్సి ఉంటుంది. ఇక మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే 12.30 నుంచి ఒంటిగంట మధ్యలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక డిన్నర్ విషానికి వస్తే.. సాయంత్రం 7లోపే డిన్నర్ కంప్లీట్ చేస్తే ఆరోగ్యానికి మేలని వైద్యులు చెబుతున్నారు.