Add 5 Years To Your Life : ఐదు ఏళ్లు ఆయుషు పెంచే ఆహారం

ఒమేగా -3 లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోను, గుండె మంటను తగ్గించడంలోను,బరువు పెరగడాన్ని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. మంచి కొలెస్ట్రాల్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా మనిషి ఆయుషు ఐదు సంవత్సరాలు పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Add 5 Years To Your Life : ఐదు ఏళ్లు ఆయుషు పెంచే ఆహారం

Eating More Of These Foods Can Add Five Years To Your Life

Add Five Years to Your Life : ఒమేగా -3 లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోను, గుండె మంటను తగ్గించడంలోను,బరువు పెరగడాన్ని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. మంచి కొలెస్ట్రాల్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే , ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో మంచి కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది . సాధారణంగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు ఆర్ట్తైస్ ను శుభ్రం చేస్తుంది. అంతే కాదు ఆర్ట్రైట్స్ అవసరం అయ్యే ఫ్యాట్స్ ను అంధించి ఆర్టిరియల్ వాల్స్ సున్నితంగా ఉంచుతుంది. తద్వారా మనిషి ఆయుషు ఐదు సంవత్సరాలు పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌ అధ్యయనంలో కొవ్వు ఆమ్లాలు రక్తంలో ఎక్కువగా ఉన్న వ్యక్తులు లేని వారి కంటే ఐదు సంవత్సరాల వరకు ఎక్కువ కాలం జీవిస్తారని సూచిస్తుంది. ఆ నిర్ధారణకు రావడానికి..పరిశోధకులు 65 ఏళ్లు పైబడిన 2,240 మంది వ్యక్తుల అపై అధ్యయనం చేశారు. వారికి సంబంధించిన డేటాను పరిశీలించిన సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు.

ఆహారంలో చిన్న మార్పులు మనం అనుకున్నదానికంటే చాలా శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయనే విషయం నిర్ధారణ అయ్యింది. ఈ అధ్యయనంలో..ఒమేగా -3 స్థాయి ధూమపానం దీర్ఘాయువుని అంచనా వేస్తుందని మేము కనుగొన్నామని తెలిపారు.పొగాకు వాడకం జీవితాన్ని తగ్గించినట్లుగానే ఒమేగా -3 స్థాయిని మనిషి ఆయువుని పొడిగిస్తుందని తెలిపారు.

డయాబెటిస్‌ నిపుణులు, డైటీషియన్ పోషకాహార స్పెషలిస్ట్ అయిన కిమ్ రోజ్-ఫ్రాన్సిస్ మాట్లాడుతూ..సాల్మన్, ఫ్లాక్స్ సీడ్స్, హాలిబట్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపల్లోను..చియా విత్తనాలు వంటివాటిలో ఒమేగా -3 అధికంగా ఉంటుందని..ఈ ఆహారాలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి వస్తుందని అలాగే అసిడిటీలాంటివాటిని నియంత్రించవచ్చని సూచించారు.ఒమేగా -3 అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల దీర్ఘాయువును కలిగిస్తుందని తెలిపారు.ఒమేగా-3 ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మనిషి జీవితంలో ఐదు సంవత్సరాల ఆయువు పెరుగుతుందని వెల్లడించారు.