Eclipses : గ్రహణాలు .. నమ్మకాలు .. గర్భంలో శిశువులకు ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

గ్రహణం ఖగోళవింతా...లేక....చెడు పరిణామమా..గ్రహణం సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఏమవుతుంది?గర్భంలో ఉన్న శిశువులకు ఏమవుతుంది? గ్రహణం మొర్రిలకు గురి అవుతారా? దేవాలయాలు ఎందుకు మూసివేస్తారు?

Eclipses : గ్రహణాలు .. నమ్మకాలు .. గర్భంలో శిశువులకు ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

Eclipses.. Superstitions.. గ్రహణం ఖగోళవింతా…లేక….చెడు పరిణామమా..గ్రహణం సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఏమవుతుంది? భయంతో గ్రహణాన్ని చూసే అనుభూతిని కోల్పోతున్నామా..గ్రహణం కూడా ప్రకృతిలో ఒక పరిణామమే అని ప్రజుల ఎప్పుడు నమ్ముతారు?

పురాణాల ప్రకారం తనను అమృతం తాగనీకుండా అడ్డుకున్న సూర్యచంద్రులపై రాహువు పగబట్టాడని, వాటిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నమే గ్రహణాలన్నది ఓ నమ్మకం. కానీ సైన్స్ ప్రకారం ఈ వాదన తప్పు. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద వారికి సూర్యుడు కనిపించకపోవడమే గ్రహణం. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడ్డకుండా భూమి అడ్డుపడుతుంది. ఇదే చంద్రగ్రహణం. భూభ్రమణం, భూ పరిభ్రమణం వంటివాటిలో సహజంగా జరిగే పరిణామం. కానీ వేల ఏళ్ల క్రితమే ఇది అనేక మూఢనమ్మకాలకు వేదికయింది.

మనిషి చరిత్రను నమోదుచేయడానికి ముందు నుంచీ గ్రహణాలున్నాయి. బహుశా అప్పుడే మూఢనమ్మకాలు బయలుదేరి ఉండొచ్చు. కానీ…మనిషి పరిణామక్రమంలో గ్రహణాలపై విస్తృత పరిశోధనలు జరిగాయి. గ్రహణం ఎందుకు ఏర్పడుతుంది..? ఎలా ఏర్పడుతుంది…? గ్రహణ సమయంలో సముద్రం ఎలా ఉంటుంది? వాతావరణంలో ఏమేం మార్పులు జరుగుతాయి…? గ్రహణం ప్రభావం ఎలా ఉంటుంది వంటివాటన్నింటినీ ఎన్నో వ్యయప్రయాసల కోర్చి… శాస్త్రీయంగా అధ్యయనం చేసి వెల్లడించారు శాస్త్రవేత్తలు. కానీ గ్రహణాల విషయంలో మూఢనమ్మకాలదే పై చేయి అవుతోంది. అసలు నిజాలు కన్నా అపోహలనే ఎక్కువగా నమ్మి, ఆచరిస్తున్నారు ప్రజలు.

సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే..కంటిచూపు దెబ్బతింటుందా..?
లేదంటున్నారు శాస్త్రవేత్తలు. గ్రహణం సమయంలో వెలువడే రేడియేషన్‌పై శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అంధత్వం వచ్చే స్థాయిలో గ్రహణం ప్రభావం ఉండదని, 15 కోట్ల దూరంలో ఉండే అంతరిక్షం నుంచి వచ్చే కిరణాలతో కళ్లు పోయే ప్రమాదం లేదని వారు చెబుతున్నారు. అయితే సోలార్‌ గ్లాసెస్‌తో జాగ్రత్తలు పాటిస్తూ..ఏ భయం లేకుండా సూర్యగ్రహణం చూడవచ్చని శాస్త్రవేత్తల సలహా.

గర్భంలో ఉన్న బిడ్డకు గ్రహణం హాని చేస్తుందన్నది నిజమేనా అంటే కానే కాదంటున్నారు శాస్త్రవేత్తలు. గ్రహణం ఉన్నంతసేపూ హానికర రేడియేషన్లు విడుదలవుతాయని, వాటితో గర్భంలో ఉన్న బిడ్డకు హాని కలుగుతుందన్న అపోహలోనూ నిజం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యకాంతి, చంద్రుని వెలుగు వంటివాటి నుంచి వెలువడే న్యూట్రినోను గ్రహిస్తూ.. ప్రతి సెకనుకు శరీరం స్పందించే తీరు మారుతుంటుందని…ఇందులో ఎక్కడా హాని కలిగే అవకాశం లేదని తెలిపారు.

వంటకు గ్రహణానికి సంబంధం ఉందా..?
అన్న ప్రశ్నకూ సమాధానమిస్తున్నారు శాస్త్రవేత్తలు. గ్రహణం సమయంలో వంట చేస్తే..ఆ రేడియేషన్ ప్రభావంతో పదార్థాలు విషతుల్యమవుతాయా అన్న ప్రశ్నకూ అది అపోహే అని సమాధానమిస్తున్నారు శాస్త్రవేత్తలు. మన ఇంట్లో,పొలాల్లోనూ ఇలాంటి రేడియేషన్ ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనావేశారు.

గ్రహణం సమయంలో చెడుకలుగుతుందా..? ఈ ప్రశ్నే…అర్ధం లేనిదంటున్నారు సైంటిస్టులు. పుట్టినరోజు తర్వాత సరిగ్గా ఆరునెలలకు గ్రహణం రావడం వంటివాటితోనూ నష్టం లేదని చెప్పారు. 300 సంవత్సరాల నుంచి గ్రహణాలపై అధ్యయనం జరుగుతోంది. గ్రహణం వల్ల మనిషి స్థితిగతుల్లో ఏ మార్పూ రాదన్నది శాస్త్రవేత్తల అంచనా. గ్రహనాన్ని ఖగోళ అద్భాతాల్లో ఒకటిగానే చూడాలి తప్ప ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.

చంద్రుడు వెన్నెల కురిపించడం, సూర్యుడి వేడిని ఇవ్వడం వంటివి ఎంత సహజ పరిణామాలో గ్రహణం కూడా అంత సహజపరిణామమేని గుర్తించాలంటున్నారు శాస్త్రవేత్తలు. గ్రహణానికి ముందు వండిన ఆహారం తినకూడదని, గ్రహణం సమయంలో స్నానం చేయకూడదని, గ్రహణం అయిపోయాక పూజలు చేయాలని నియమాలు పెట్టుకోవద్దని …ఎప్పుడు సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడినా తగిన జాగ్రత్తలతో వాటిని చూసి అరుదైన అనుభూతిని పొందాలని కోరుతున్నారు.