Sanjay Raut: సంజయ్ రౌత్ ఇంట్లో న‌గ‌దు స్వాధీనం చేసుకున్న ఈడీ!

పాత్రా చాల్ కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు చెందిన ముంబైలోని ఇంట్లో సోదాలు జ‌రిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూప‌ని రూ.11.50 ల‌క్ష‌లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సంజ‌య్ రౌత్‌ను ఈడీ అధికారులు ఇవాళ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, సంజ‌య్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేయ‌లేద‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది విక్రాంత్ సాబ్నె అంటున్నారు. ఇవాళ ఉద‌యం ఈడీ తాజాగా స‌మ‌న్లు పంపిందని, దీంతో సంజయ్ రౌత్ ఈడీ కార్యాల‌యానికి వెళ్ళార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

Sanjay Raut: సంజయ్ రౌత్ ఇంట్లో న‌గ‌దు స్వాధీనం చేసుకున్న ఈడీ!

Sanjay Raut

Sanjay Raut: పాత్రా చాల్ కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు చెందిన ముంబైలోని ఇంట్లో సోదాలు జ‌రిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు లెక్కల్లో చూప‌ని రూ.11.50 ల‌క్ష‌లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సంజ‌య్ రౌత్‌ను ఈడీ అధికారులు ఇవాళ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. సంజ‌య్ రౌత్‌కు ఈడీ రెండుసార్లు స‌మ‌న్లు పంపి విచార‌ణ‌కు రావాల‌ని చెప్పింది. అయితే, సంజ‌య్ రౌత్ వాటిని ప‌ట్టించుకోలేదు. దీంతో ఆయ‌న‌ను ఇవాళ అరెస్టు చేసింది.

అయితే, సంజ‌య్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేయ‌లేద‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది విక్రాంత్ సాబ్నె అంటున్నారు. ఇవాళ ఉద‌యం ఈడీ తాజాగా స‌మ‌న్లు పంపిందని, దీంతో సంజయ్ రౌత్ ఈడీ కార్యాల‌యానికి వెళ్ళార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. విప‌క్ష పార్టీల‌కు వేధించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు చేయిస్తోంద‌ని ప‌లువురు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తోన్న వేళ సంజ‌య్ రౌత్‌ను ఈడీ విచారిస్తుండ‌డం హాట్ టాపిక్‌గా మారింది. సంజ‌య్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేయ‌డాన్ని రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ పేర్కొంది.

China: అంద‌రినీ భ‌య‌పెట్టిన త‌మ‌ రాకెట్ శ‌కలాలు ఎక్క‌డ ప‌డ్డాయో తెలిపిన చైనా