Sanjay Raut: సంజయ్ రౌత్‌కు ఈ నెల 4 వరకు ఈడీ కస్టడీ.. ముంబై స్పెషల్ కోర్టు ఆదేశం

మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈ నెల 4 వరకు ఈడీ కస్టడీ విధిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ రౌత్‌ను ఆదివారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

Sanjay Raut: సంజయ్ రౌత్‌కు ఈ నెల 4 వరకు ఈడీ కస్టడీ.. ముంబై స్పెషల్ కోర్టు ఆదేశం

Sanjay Raut

Sanjay Raut: పాత్రా చల్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈ నెల 4వరకు ఈడీ కస్టడీ విధిస్తూ ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం రాత్రి సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన ఈడీ సోమవారం కోర్టులో హాజరుపర్చింది. ఈ సందర్భంగా ఈడీ కోరిక మేరకు జడ్జి ఎంజీ దేశ్‌పాండే సంజయ్ రౌత్ కస్టడీకి ఆదేశించారు. అయితే, ఈడీ ఎనిమిది రోజుల కస్టడీ కోరినప్పటికీ, కోర్టు దీనికి నిరాకరించింది.

Trinamool MP: పార్లమెంట్‌లోకి వంకాయ తీసుకొచ్చిన మహిళా ఎంపీ.. ఎందుకంటే..

కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంగా సంజయ్.. మీడియాతో మాట్లాడుతూ ఈ చర్య తమను అంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా వర్ణించారు. ఈ అవినీతికి సంబంధించి ప్రధాన సూత్రధారి అయిన ప్రవీణ్ రౌత్ నుంచి సంజయ్ రౌత్‌ కుటుంబం రూ.1.06 కోట్లు నేరుగా లబ్ధి పొందినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. సంజయ్ రౌత్‌ను కోర్టులో హాజరుపరిచే ముందు అధికారులు ఆయన్ను జేజే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. సంజయ్ రౌత్‌ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో ప్రస్తావించారు. దీంతో ఆయనకు అవసరమైన మందులు, ఆహారం ఇంటి నుంచి అందించేందుకు తమకు అభ్యంతరం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది.

Jackfruit: పనస పండు కోసం ఏనుగు కష్టం.. వైరల్‌గా మారిన వీడియో

సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడంతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ నేత ఉద్ధవ్ థాక్రే ఆయన కుటుంబానికి మద్దతు తెలిపారు. నేరుగా సంజయ్ రౌత్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. తాము ఎవరికీ భయపడబోమని, సంజయ్ రౌత్ విషయంలో తాము గర్విస్తున్నామని చెప్పారు. మరోవైపు సంజయ్ రౌత్‌ అరెస్టును నిరసిస్తూ ఆయన అనుచరులు, శివసేన కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.