Shiv Sena: సంజయ్ రౌత్‌కు ఈడీ మరోసారి సమన్లు
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు మరోసారి సమన్లు పంపింది. ముంబైలోని పత్రా చావ్ల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది.

Shiv Sena: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు మరోసారి సమన్లు పంపింది. ముంబైలోని పత్రా చావ్ల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది. సంజయ్ రౌత్‌ను నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారిస్తామని పేర్కొంది. ఈ కేసులో సంజయ్ రౌత్ నేడు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్నాథ్ షిండే
అయితే, ఆయన గైర్హాజరు కావడంతో మరోసారి నోటీసులు పంపింది. ఇవాళ సంజయ్ రౌత్ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ… విచారణకు హాజరుకావడానికి తాము మరింత సమయం కోరడంతో ఈడీ అందుకు అంగీకరించిందని తెలిపారు. మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలు కొందరు ఏక్నాథ్ షిండేతో కలిసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు పంపడం కేంద్ర ప్రభుత్వం చేయిస్తోన్న పనేనంటూ విమర్శలు వస్తున్నాయి.