ఒక ఫోటో ప్లీజ్ : తన భర్త చదివిన పాఠశాల వద్ద ఫోటో దిగిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఒక ఫోటో ప్లీజ్ : తన భర్త చదివిన పాఠశాల వద్ద ఫోటో దిగిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Education minister sabitha indra reddy visit sivarampally high school : తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన శివరాంపల్లిలోని పాఠశాలను సందర్శించారు.  పాఠశాలలోని పురాతన భవనాన్ని కూల్చి వేయాలని ఆమె ఇప్పటికే విద్యాశాఖా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలను సందర్శిస్తుండగా స్ధానిక నాయకుడు ఒకరు ఆమె భర్త దివంగత మాజీ మంత్రి ఇంద్రారెడ్డి ఇదే పాఠశాలలో చదివిన విషయాన్ని గుర్తు చేసారు. దీంతో ఆమె కూల్చి వేయమని ఆదేశించిన పాత భవనం వద్దకు వెళ్లారు. నా భర్త చదివిన పాఠశాల గుర్తుగా అక్కడ నిలబడి ఒక ఫోటో తీయమని కోరారు. ఈ ఫొటోను తన మనవలకు చూపించి వారి తాత చదివిన పాఠశాల గురించి వివరిస్తానని మంత్రి అన్నారు.