Eid-ul-Fitr : ఈద్ ముబారక్..రంజాన్ విశేషాలు

  • Published By: madhu ,Published On : May 24, 2020 / 04:42 AM IST
Eid-ul-Fitr : ఈద్ ముబారక్..రంజాన్ విశేషాలు

గత నెల రోజులుగా కఠినంగా చేసిన ఉపవాస దీక్షలు ఆదివారంతో ముగియనున్నాయి. దీంతో సోమవారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు ముస్లిం సోదరులు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ తో సహా అన్ని దేశాలు రంజాన్ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటుంటారు. కానీ..ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా..విధించిన లాక్ డౌన్ వల్ల ఇళ్లల్లోనే రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కానీ..సౌదీ అరేబియాతో పాటు, దుబాయ్, కువైట్ ఆదివారమే పండుగను జరుపుకుంటున్నారు. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కూడా ఆదివారమే రంజాన్ నిర్వహిస్తున్నారు. గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియాలో 2020, మార్చి 22వ తేదీ శుక్రవారం నెలవంక కనిపించలేదు. అందువల్ల..ఆదివారం ఈ పండుగ వేడుకలని నిర్వహించుకుంటున్నారు. ఈద్ – ఉల్ – ఫితర్ పండుగను సోమవారం జరుపుకోవాలని ఢిల్లీ జామా మసీదు సాహీ ఇమామ్ అహ్మద్ షా బుకారీ, హైదరాబాద్ లోని రూహియత్ ఇలాల్ కమిటీ అధ్యక్షుడు అజీముద్దీన్ ప్రకటించారు. దీంతో పండుగను నిర్వహించుకొనేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు.

శనివారం ఢిల్లీతో ..ఇతర దేశాల్లో నెలవంక కనిపించలేదని, ఆదివారం రంజాన్ మాసం పూర్తి కావడంతో నెలవంక కనిపిస్తుందన్నారు. నెలవంక కనిపించే తీరును బట్టి..ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో జరుగుతుంటుంది. ఇస్లామిక్ కేలండర్ ప్రకారం రంజాన్ 9 నెలలో వస్తుంది. రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తుంటారు. కుటుంబాలు, బంధువులు విందులు జరుపుకుంటారు. శుభాకాంక్షలు తెలియచేసుకుంటారు. ఖురాన్ పటించడమే కాకుండా దానధర్మాలు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆ సీన్ కనిపించ లేదు. లాక్ డౌన్ వల్ల అన్నీ బంద్ అయ్యాయి. 

రంజాన్ మాసం వచ్చిదంటే చాలు..ముందుగా గుర్తుకొచ్చిది హలీం. కరోనా దీనికి దెబ్బ కొట్టింది. ఎక్కడా హలీం అమ్మకాలు జరుపవద్దని ఆదేశాలు ఇవ్వడంతో..వీటిని తయారు చేయలేదు. దీంతో హలీం ప్రియులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రంజాన్ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మార్కెట్ లన్నీ సందడి సందడిగా ఉంటుంటాయి. మసీదుల్లో ప్రార్థనలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంటారు.

పండుగకు కావాల్సిన వాటిని కొనుక్కోవడానికి ప్రజలు భారీగా తరలివస్తుండడంతో మార్కెట్లు కళకళలాడేవి. కానీ కరోనా వైరస్ నీళ్లు చల్లింది. వ్యాపారాలు లేక మార్కెట్లు బోసిపోయాయి. కొన్ని సడలింపులు ఇవ్వడం..సరి బేసి విధానం అమలు చేయడంతో పెద్దగా షాపింగ్ జరగడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ లోని రద్దీగా ఉండే..మదీనా, పత్తర్ గట్టి, శాలిబండ, లాడ్ బజార్, నాంపల్లి, మల్లేపల్లి, చార్మినార్, సుల్తాన్ బజార్ తదితర ప్రముఖ మార్కెట్ లో కళ తప్పాయి. రాత్రి వేళల్లో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. రంజాన్ పండుగ సందర్భంగా..రాత్రి వేళ మార్కెట్ కు అనుమతినిస్తుంది ప్రభుత్వం. సాయంత్రం 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫూ అమల్లో ఉండడంతో వ్యాపారాలు లేకుండా పోయాయి.