Electric Vehicles: భారీగా తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు!

అసలే పెట్రోల్ ధరలు మండిపోతుండగా సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గడం అనుకూలంగా కనిపిస్తుంది.

Electric Vehicles: భారీగా తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు!

Electric Vehicles

Electric Vehicles: అసలే పెట్రోల్ ధరలు మండిపోతుండగా సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గడం అనుకూలంగా కనిపిస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు చేపట్టిన చర్యలు ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావితం చూపడంతో ఇప్పుడు భారీగా తగ్గి ప్రజలను ఆకర్షిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేమ్-2 (Fast Adoption and Manufacturing of Electric Vehicles)-II ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలలో ఇటీవల సవరణలు చేసింది. ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఫేమ్ ప్రాజెక్టులో భాగంగా ధరలు తగ్గిన వాటిలో ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో ప్రముఖంగా కనిపిస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఏకంగా రూ15,600 వరకూ తగ్గాయి. కస్టమర్ ఎంచుకునే మోడల్‌ను బట్టి ఈ సబ్సిడీ మారుతుంది. హీరో కంపెనీలో పాపులర్ ఎలక్టిక్ స్కూటర్ ఆప్టిమా హెచ్‌ఎక్స్ డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.15,680 తగ్గి, రూ.58,990గా ఉండగా అలాగే సింగిల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.8,040 తగ్గి, రూ.53,600 గా ఉంది.