Elon Musk : భారత్ కు టెస్లా కార్లు .. ఎలెన్ మస్క్ రిప్లై ఇదే!

భారత్ లో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కి ఎలెన్ మస్క్ రిప్లై ఇచ్చారు. భారత్ లో విడుదల చేసేందుకు తాము ఆతృతగా ఉన్నామని, ఇందుకోసం భారత వాణిజ్య శాఖను సంప్రదించామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాలపై రాయితీ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు

Elon Musk : భారత్ కు టెస్లా కార్లు .. ఎలెన్ మస్క్ రిప్లై ఇదే!

Elon Musk

Elon Musk : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హావ నడుస్తుంది. ఓ వైపు ఇంధన ధరలు, మరోవైపు కాలుష్యం పెరిగిపోతుండటంతో యువతోపాటు, పెద్దవారు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా భారీ రాయితీలు ఇస్తుంది. దేశ తయారీ కంపెనీలను ప్రోత్సహించేందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాయితీలను ప్రకటించాయి.

ఇక ఇదిలా ఉంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీ ఇవ్వడం లేదు ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్ వాహనాలకు విధించే సుంకాలనే ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా విదిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఓ భారతీయుడు ఎలెన్ మస్క్ ని ట్యాగ్ చేస్తూ టెస్లా ఎలక్ట్రిక్ కార్లను భారత్ లో విడుదల చేయాలనీ ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చారు మస్క్.. భారత్ లో విడుదల చేయాలనే ఆత్రుత తమకు ఉందని.. కానీ దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నాయని తెలిపారు.

సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లకు విధించినట్లే ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా అదే విధంగా సుంకం విధిస్తున్నారని తెలిపారు. తాత్కాలికంగా అయిన సుంకంలో రాయితీ ఇస్తే తాము భారత్ లో టెస్లాను విడుదల చేస్తామని తెలిపారు. ఇక ఏడాది చివరి నాటికి టెస్లా ఎలక్ట్రిక్ కార్లను భారత్ లోకి తీసుకొచ్చేందుకు టెస్లా ప్రతినిధులు వాణిజ్య శాఖ, నీతి ఆయోగ్ కి లేఖలు రాసినట్లు రాయిటర్స్ అనే ఇంగ్లీష్ మీడియా పేర్కొంది. దిగుమతి సుంకం 40 శాతానికి తగ్గితే భారత్ కు టెస్లాను తీసుకొస్తామని లేఖలో పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది.

మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పెంచేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు భారీ రాయితీలను అందిస్తుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి కూడా రాయితీలు లభిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ టాక్స్ లు మినహాయింపు కల్పించాయి.