Wild elephant: గోడలు బద్దలు కొట్టి వంటింట్లో దూరిన ఏనుగు!

కిచెన్‌ నుండి ఏదో కింద పడిన చప్పుడు రావడంతో ముందు ఆ ఇల్లాలు ఏదో పిల్లి ఆహారం కోసం వెతుకుంతుందేమోలే అదే పోతుంది అనుకున్నారు. కానీ కాసేపటికి పెద్ద పెద్దగా గిన్నెలు కింద పడుతూ ఆగకుండా భారీ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. దీంతో డౌట్ లేదు ఇది పిల్లి కాదు ఏదో సంథింగ్ అనుకున్నారు.

Wild elephant: గోడలు బద్దలు కొట్టి వంటింట్లో దూరిన ఏనుగు!

Wild Elephant

Wild elephant: కిచెన్‌ నుండి ఏదో కింద పడిన చప్పుడు రావడంతో ముందు ఆ ఇల్లాలు ఏదో పిల్లి ఆహారం కోసం వెతుకుంతుందేమోలే అదే పోతుంది అనుకున్నారు. కానీ కాసేపటికి పెద్ద పెద్దగా గిన్నెలు కింద పడుతూ ఆగకుండా భారీ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. దీంతో డౌట్ లేదు ఇది పిల్లి కాదు ఏదో సంథింగ్ అనుకున్నారు. కొంపదీసి ఇంట్లో దొంగలు పడ్డారేమోనని ఆతృతగా కిచెన్ లోకి వెళ్తే అక్కడ దృశ్యం చూసి ఆమె షాక్ కి గురైంది.

ఓ భారీ ఏనుగు కిచెన్ గోడలు బద్దలు కొట్టి మరీ తొండంతో ఆహరం కోసం వెతుకుతూ కిచెన్ మొత్తం కెలికేస్తోంది. థాయ్‌ల్యాండ్‌ లోని ప్యూంగ్‌ప్రాసొప్పన్‌ లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఏనుగు ఫుడ్ కోసం చేసిన ఈ బీభత్సాన్ని ప్యూంగ్‌ప్రాసొప్పన్‌ తన ఫోన్‌తో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇండియాలో ఏనుగులైనా థాయిలాండ్ ఏనుగులైనా ఆకలేస్తే ఒకేలా ప్రవర్తిస్తాయి. దగ్గరలో ఎమన్నా ఆహరం దొరుకుతుందేమోనని మొత్తం శోధించి పట్టుకుంటాయి. మన దగ్గర పంట పొలాలు అడవులకు దగ్గర ఉంటాయి కనుక వాటి మీద దాడి చేసి ధ్వంసం చేస్తాయి. అదే ఈ వీడియోలో ఇల్లు దగ్గర ఉండడంతో ఆ గజరాజు ఇంటి మీద దాడి చేసింది. కెంగ్ క్రాచన్ జాతీయ ఉద్యానవనంలో నివసించే బూన్చువే అనే ఈ ఏనుగు సమీపంలోని ఆ గ్రామానికి వెళ్లడం సహజమే కాగా తొలిసారి ఇంటి మీద దాడి చేసి ఆహారాన్ని వెతుక్కుందట.