Elon Musk: అలా చేయకుంటే డీల్ రద్దు చేసుకుంటా.. ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ వార్నింగ్

తాను అడిగిన సమాచారం ఇవ్వకుంటే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకుంటానని ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. తాను కోరినట్లుగా స్పామ్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్ల సమాచారం ఇవ్వాల్సిందేనని కోరాడు.

Elon Musk: అలా చేయకుంటే డీల్ రద్దు చేసుకుంటా.. ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ వార్నింగ్

Elon Musk

Elon Musk: తాను అడిగిన సమాచారం ఇవ్వకుంటే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకుంటానని ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. తాను కోరినట్లుగా స్పామ్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్ల సమాచారం ఇవ్వాల్సిందేనని కోరాడు. ఈ అంశంపై ట్విట్టర్‌కు సోమవారం లేఖ రాశాడు. 44 బిలియన్ డాలర్లు చెల్లించి, ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో ఎలన్ మస్క్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Russian Oil: రష్యా చమురు.. తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు భారత్ యత్నం

ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఆలోగా తనకున్న సందేహాలపై ఎలన్ మస్క్ కంపెనీని ప్రశ్నిస్తున్నాడు. కొనుగోలు విషయంలో ట్విట్టర్‌కు, ఎలన్ మస్క్ మధ్య ఇంకా కొన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఒప్పందం కుదిరినప్పటికీ ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేయకపోవచ్చని కూడా కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు మస్క్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కంపెనీని కొనుగోలు చేసేముందు ఆ సంస్థకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు తనకు ఉందని, ఈ హక్కును ట్విట్టర్ పట్టించుకోవడం లేదని లేఖలో మస్క్ ఆరోపించారు. ఒప్పందం సందర్భంగా వెల్లడించిన అనుమానాలపై కూడా ట్విట్టర్‌ స్పందించడం లేదన్నారు. దీంతో ప్రస్తుతానికి ఈ ఒప్పందాన్ని హోల్డ్‌లో ఉంచినట్లు చెప్పారు. తాను అడిగిన సమాచారం ఇవ్వకుంటే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటానని హెచ్చరించారు.

Remdesivir Vials: ఎక్స్‌పైరీ డేట్‌కు చేరువలో రెమిడెసివిర్‌లు.. 60 లక్షల ఇంజక్షన్ల ధ్వంసం

ఒప్పందం ప్రకారం ఎవరు డీల్ రద్దు చేసుకంటే వాళ్లు పరిహారం చెల్లించాలి. ఒకవేళ సరైన కారణం చూపకుండా ఎలన్ మస్క్ డీల్ రద్దు చేసుకుంటే, ఆయన ట్విట్టర్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఇటీవలి కాలంలో ట్విట్టర్‌ షేర్ విలువ పడిపోయింది. 5.5 శాతం తగ్గి, 37.95 డాలర్లుగా ఉంది.