Elon Musk: టెస్లా కార్లకంటే రోబోలతోనే ఎక్కువ వ్యాపారం: ఎలన్ మస్క్

టెస్లా రూపొందిస్తున్న కార్ల కంటే టెస్లా ఆధ్వర్యంలో తయారుచేస్తున్న రోబోలతోనే భవిష్యత్తులో ఎక్కువ లాభాలుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు టెస్లా సీఈవో ఎలన్ మస్క్.

Elon Musk: టెస్లా కార్లకంటే రోబోలతోనే ఎక్కువ వ్యాపారం: ఎలన్ మస్క్

Elon Musk

Elon Musk: టెస్లా రూపొందిస్తున్న కార్ల కంటే టెస్లా ఆధ్వర్యంలో తయారుచేస్తున్న రోబోలతోనే భవిష్యత్తులో ఎక్కువ లాభాలుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో టెస్లా త్రైమాసిక ఫలితాలు వివరించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రణాళికలు, భవిష్యత్ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ టెస్లా రూపొందిస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకంటే భవిష్యత్తులో రోబోల వల్లే ఎక్కువ వ్యాపారం జరుగుతుందన్నారు.

elon musk: అపర కుబేరుడు.. సొంతిల్లు కూడా లేదట!

టెస్లా సంస్థ ‘ఆప్టిమస్ రోబో’ పేరుతో ఒక ప్రోగ్రామ్ రూపొందిస్తోంది. టెక్సాస్‌లోని భారీ ఫ్యాక్టరీలో ఈ ప్రోగ్రామ్ జరుగుతోంది. దీనిలో భాగంగా రోబో ట్యాక్సీలతోపాటు, ఒక హ్యూమనాయిడ్ రోబోను రూపొందిస్తున్నారు. ఇప్పటికే హ్యూమనాయిడ్ రోబో తయారీ మొదలైంది. వచ్చే ఏడాది ఈ రోబోను ప్రదర్శిస్తారు. ఇది 5.8 అంగుళాల ఎత్తుతో, 57 కిలోల బరువు కలిగి ఉంటుంది. గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నడవగలదు. దీని ముఖాన్ని ఒక స్క్రీన్‌గా తయారుచేస్తున్నారు. దీని స్క్రీన్‌పై ముఖ్యమైన సమాచారం డిస్‌ప్లే అవసరం అవుతుంది. ఇది ఆటోపైలట్ డ్రైవర్ అసిస్టెన్స్ సాఫ్ట్‌వేర్‌తో రూపొందుతోంది. మరోవైపు రోబోట్యాక్సీలను కూడా ‘ఆప్టిమస్ రోబో’ ప్రోగ్రామ్‌లో భాగంగా రూపొందిస్తున్నారు.

Russia-Elon Musk: ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఉపగ్రహాలపై ‘అంతరిక్ష యుద్ధం’ ప్రకటించిన రష్యా

2024కల్లా పెద్దస్థాయిలో రోబోట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయని టెస్లా చెప్పింది. ‘‘ఆప్టిమస్ రోబో ప్రోగ్రామ్ ప్రాధాన్యం భవిష్యత్తులో తెలుస్తుంది. దీని గురించి బాగా అర్థం చేసుకున్నవాళ్లకే ఇది ఎంత వ్యాపారం చేయబోతుందో తెలుస్తుంది. ఈ ప్రోగ్రామ్ నుంచి మరిన్ని ఆశ్చర్యకరమైన ఉత్పత్తులు వస్తాయి’’ అని ఎలన్ మస్క్ చెప్పుకొచ్చారు.