Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ రద్దు చేస్తూ నిర్ణయం

ట్విట్టర్ ఉద్యోగులకు ఆ సంస్థ నూతన అధినేత ఎలన్ మస్క్ షాక్ ఇవ్వబోతున్నారు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పద్ధతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీన్ని అమలుచేయబోతున్నారు.

Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ రద్దు చేస్తూ నిర్ణయం

Elon Musk: ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ కంపెనీ నిర్వహణ వ్యవహారాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పద్ధతిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

Bridegroom: అత్తింటివారు ఇచ్చిన కారుతో అత్తను ఢీకొట్టి చంపిన అల్లుడు

త్వరలోనే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది ఉద్యోగులకు ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపు ఉంటుంది. ఎలన్ మస్క్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం తన సంస్థల్లో ఒకటైన టెస్లా ఉద్యోగులు కూడా ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని ఆదేశించాడు. అన్ని స్థాయిల ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ పాలసీని ట్విట్టర్ సంస్థలో పాటించబోతున్నాడు. మరోవైపు ట్విట్టర్ సంస్థ నిర్వహణా వ్యయాన్నితగ్గించే ఉద్దేశంతో దాదాపు సగం వరకు ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు సంస్థలో ప్రారంభమైంది. ఎవరిని ఉద్యాగాల్లో ఉంచాలి? ఎవరిని తొలగించాలి? వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు ఎలన్ మస్క్ సలహా బృందం అధ్యయనం చేస్తోంది.

Kerala Guv: ఆ విషయం నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్

దీనికోసం అనేక ప్రమాణాలు రూపొందిస్తోంది. కాగా, ఇప్పటికే ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు ఎప్పటి నుంచి ఆఫీస్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనే విషయంలో కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, మరికొద్ది వారాల్లోలనే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీకి స్వస్తి చెబ్బబోతున్నారు. నిజానికి కోవిడ్ సందర్భంగా మొదలైన ఈ పద్ధతిని అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకోగానే, పరాగ్ అగర్వాల్‌ను తొలగించిన సంగతి తెలిసిందే.