టీడీపీలో తీవ్ర విషాదం.. మాజీ ఎంపీ కొడుకు, యువ నేత మృతి

టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పెద్ద కొడుకు, యువ నేత మాగంటి రాంజీ కన్నుమూశారు. ఆయన వయసు 37ఏళ్లు.

టీడీపీలో తీవ్ర విషాదం.. మాజీ ఎంపీ కొడుకు, యువ నేత మృతి

eluru ex mp maganti babu son maganti ramji dies: టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పెద్ద కొడుకు, యువ నేత మాగంటి రాంజీ కన్నుమూశారు. ఆయన వయసు 37ఏళ్లు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాంజీ.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజుల క్రితం ఆయన్ను కుటుంబసభ్యులు ఏలూరు ఆంధ్రా ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగిస్తుండగానే పరిస్థితి విషమించడంతో రాంజీ తుది శ్వాస విడిచారు.

రాంజీ అనారోగ్యానికి కారణం ఏంటనేది తెలియరాలేదు. మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నం చేశారని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ, దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. కాగా, రాంజీ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు.

రాంజీ.. టీడీపీలో యువనేతగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలంగా వ్యవహరించే వారు. పార్టీ వ్యవహారాల్లో తండ్రి మాగంటి బాబుకు చేదోడువాదోడుగా ఉండేవారు. సోషల్ మీడియాలో రాంజీ యాక్టివ్‌గా ఉండే వారు. కార్యకర్తలతో నిత్యం టచ్‌లో ఉండే వారు. వారం క్రితం కూడా ట్విట్టర్‌లో పోస్టులు చేశారు. అలాంటిది, కొద్ది రోజుల వ్యవధిలో రాంజీ కన్నుమూయడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంత చిన్న వయసులో ఇంత ఘోరం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాగంటి రాంజీ ఆశ్మకు శాంతి చేకూరాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రాంజీ మృతి పట్ల సినీ నటుడు నారా రోహిత్‌ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.