Email Recall Trick : మీరు పొరపాటున ఈ-మెయిల్ ఎవరికైనా పంపారా? ఎవరూ చూడకముందే ఆ మెయిల్ రీకాల్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Email Unsend Trick : సాధారణంగా చాలామంది జీమెయిల్ వినియోగదారులు ఎవరికో ఒకరికి మెయిల్స్ పంపుతుంటారు. కొన్నిసార్లు పంపిన ఈ-మెయిల్ ఏదైనా తప్పిదం జరిగే అవకాశం ఉంటుంది. పొరపాటున ఏదైనా టైపింగ్ తప్పుగా చేయడంతో పాటు రాంగ్ యూజర్ కు కూడా మెయిల్ వెళ్లిపోతుంది.

Email Unsend Trick : సాధారణంగా చాలామంది జీమెయిల్ వినియోగదారులు ఎవరికో ఒకరికి మెయిల్స్ పంపుతుంటారు. కొన్నిసార్లు పంపిన ఈ-మెయిల్ ఏదైనా తప్పిదం జరిగే అవకాశం ఉంటుంది. పొరపాటున ఏదైనా టైపింగ్ తప్పుగా చేయడంతో పాటు రాంగ్ యూజర్ కు కూడా మెయిల్ వెళ్లిపోతుంది. ఒకవేళ మెయిల్ యూజర్ ఐడీ కరెక్ట్ అయితే.. వారికి తప్పకుండా పంపిన మెయిల్ చేరుతుంది. అయితే, అలా పంపిన మెయిల్ ఏదైనా అభ్యంతరకంగా ఉంటే మాత్రం ఇబ్బంది తప్పదు.

అలాంటి పరిస్థితుల్లో పంపిన ఈ-మెయిల్ కరెక్ట్ చేయడం కుదరని పని.. అందుకే పొరపాటున పంపిన ఈ-మెయిల్స్ వెంటనే రీకాల్ చేసేందుకు ఒక మార్గం ఉంది. కొన్నిసార్లు ఏదైనా పంపిన ఈమెయిల్ అటామెంట్ లేకుండా పంపుతుంటారు. అలాంటి సమయాల్లో కూడా ఆ మెయిల్ రీకాల్ చేసి మళ్లీ కొత్తగా ఈమెయిల్ పంపుకోవచ్చు. సాధారణ ఈ-మెయిల్స్ అయితే పర్వాలేదు. ఏదైనా సీక్రెట్ డేటా పంపే సమయంలో ఇలాంటి పొరపాటు జరిగితే ఆందోళన చెందాల్సిందే కదా.. అందుకే అలాంటి తప్పుడు ఈ-మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండవచ్చు.

ఇకపై మీరు ఎవరికైనా తప్పుడు ఈ-మెయిల్స్ పంపినట్టయితే.. ఆ మెయిల్ రీకాల్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ (Microsoft Outlook‌)లో ఫీచర్‌ ఉంది. ఈ ఫీచర్ ద్వారా మీ మెయిల్‌ను పంపిన 120 నిమిషాలలోపు ఎవరికి పంపారో వారి జీమెయిల్ అకౌంట్ నుంచి రీకాల్ చేయవచ్చు. ఈ రీకాల్ ఫీచర్‌తో MS Outlook ఈ-మెయిల్‌ను పంపకుండా, రీసీవర్ ఇన్‌బాక్స్ నుంచి పంపిన మెయిల్ తొలగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

Sent email by mistake_ Here’s how to recall email in Microsoft Outlook

జీమెయిల్ యూజర్లు తమ అటాచ్‌మెంట్‌లను కోల్పోవడం లేదా ఈ-మెయిల్ ఏదైనా తప్పులను సరిద్దుకోవడానికి రీకాల్ చేసిన మెయిల్‌ను కొత్త దానితో రిప్లేస్ చేయవచ్చు. ముఖ్యంగా, మీరు Send బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మెసేజ్ రీకాల్ (Message Recall) ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మీరు రీసీవర్ ఇద్దరూ ఒకే సంస్థలో Microsoft 365 లేదా Microsoft Exchange ఈ-మెయిల్ ఖాతాను ఉపయోగిస్తున్నట్లయితే మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి Gmail లేదా Hotmail, Gmail వంటి మరొక మెయిల్‌కి ఈ-మెయిల్ పంపితే మాత్రం పంపిన ఈ-మెయిల్ రీకాల్ చేయడం కుదరదని గమనించాలి.

Read Also :  New Gmail Design : జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. కొత్త జీమెయిల్ డిజైన్ తప్పక వాడాల్సిందే.. ఇకపై పాత డిజైన్‌కు మారలేరు..!

MS Outlookలో మీరు పంపిన ఈ-మెయిల్‌ను తిరిగి ఇలా రీకాల్ చేయవచ్చు?

* Outlook పంపిన ఇమెయిల్‌ను కూడా రీకాల్ చేయవచ్చు.
* MS Outlookని ఓపెన్ చేయండి. విండో ఎడమ వైపున ఉన్న ఫోల్డర్ పేన్‌లో, పంపిన మెసేజ్ ఫోల్డర్‌ను ఎంచుకోండి.
* ఇప్పుడు ఆ పోల్డర్‌పై డబుల్ క్లిక్ చేయండి.
* మీరు రీకాల్ చేయాలనుకుంటున్న మెయిల్ ఓపెన్ చేయండి.
* మీరు ఆ మెయిల్‌పై డబుల్ క్లిక్ చేయాలి. తద్వారా మెసేజ్ మరొక విండోలో ఓపెన్ అవుతుంది. అది రీడింగ్ ప్యానెల్‌లో కాదని గమనించాలి.
* మీరు మెసేజ్ ట్యాబ్ నుంచి కాకుండా క్లాసిక్ రిబ్బన్ డిజైన్‌ని ఉపయోగిస్తుంటే.. Actions> Recall This Message పై క్లిక్ చేయండి.
* మీరు క్లాసిక్ రిబ్బన్‌ని ఉపయోగిస్తుంటే.. మెసేజ్ ట్యాబ్‌ని ఎంచుకుని, ఆపై More Commands ఎంచుకోండి.
* ఆ తర్వాత point to actionsపై క్లిక్ చేసి, Recall This Message ఎంచుకోండి.
* ఇప్పుడు మీరు ఈ మెసేజ్ Unread Copy Delete ఆప్షన్‌పై క్లిక్ చేయాలి లేదా Unread కాపీలను Delete చేసి కొత్త మెసేజ్‌తో Replace చేయాలి.
* ఆ తర్వాత, ప్రతి యూజర్ చెక్ బాక్స్ కోసం రీకాల్ సక్సెస్ అయితే లేదా (fails for each recipient check box) ఎంచుకోండి.
* OK ఎంచుకోండి.
* మీరు ప్రత్యామ్నాయ మెసేజ్ పంపుతున్నట్లయితే.. Message కంపోజ్ చేసి, ఆపై send క్లిక్ చేయండి.

మీ అకౌంట్ MAPI లేదా POP అకౌంట్ అయితే మాత్రం ఈ రీకాల్ ఫీచర్ పని చేయదు.

* Outlookలో ఈ-మెయిల్ మెసేజ్ రీకాల్ చేయడానికి కొన్నింటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
* మీరు పంపిన మెయిల్ మీ అవసరం లేదంటే.. మీరు రీసీవర్ ఇన్‌బాక్స్ నుంచి రీకాల్ చేయలేరు.
* మీరు, మీ రీసీవర్ ఇద్దరూ తప్పనిసరిగా Exchange సర్వర్ ఈ-మెయిల్ అకౌంట్ కలిగి ఉండాలి
* Outlookని ఈ-మెయిల్ క్లయింట్‌గా ఉపయోగించాలి.
* మీరు రీకాల్‌ను ప్రాసెస్ చేసేందుకు రీసీవర్ మెయిల్‌బాక్స్ ఓపెన్ చేసి ఉంటుంది.
* ఒకవేళ ఈ-మెయిల్ చదవకపోయినా, రీసీవర్ ఇన్‌బాక్స్‌లో ఉన్నా రీకాల్ వర్కౌట్ కాదు.
* Receipt ఇన్‌బాక్స్‌లోని మెసేజ్.. ఏ విధంగానూ మార్చే రూల్, స్పామ్ ఫిల్టర్ లేదా యాడ్-ఆన్‌కు లేదని గమనించాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Gmail Storage Full : మీ జీమెయిల్ స్టోరేజీ ఫుల్ అయిందా? కొత్త మెయిల్స్ రావడం లేదా? ఇలా సెకన్లలో స్టోరేజీని క్లీన్ చేయొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు