Bigg Boss 5 : కూతురు వియా రాకతో ఎమోషనల్ అయిన రవి.. అదిరిపోయిన ప్రోమో

ఇప్పటికే కాజల్‌, శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్‌ల కుటుంబసభ్యులు వచ్చి వెళ్లారు. తాజాగా బిగ్ బాస్ నుంచి ఇవాళ్టి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. నేటి ఎపిసోడ్‌లో......

Bigg Boss 5 : కూతురు వియా రాకతో ఎమోషనల్ అయిన రవి.. అదిరిపోయిన ప్రోమో

Ravi

Bigg Boss 5 :  నిన్నటి నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌ ఎమోషన్స్‌తో నిండిపోయింది. ప్రతి సీజన్‌లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్‌ బిగ్‌బాస్‌లోకి వచ్చారు. ఇప్పటికే కాజల్‌, శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్‌ల కుటుంబసభ్యులు వచ్చి వెళ్లారు. తాజాగా బిగ్ బాస్ నుంచి ఇవాళ్టి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. నేటి ఎపిసోడ్‌లో యాంకర్‌ రవి కోసం భార్య నిత్య, కూతురు వియా వచ్చారు.

Samantha : బైసెక్సువల్ లేడీగా సమంత.. సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ..

రవికి తన కూతురు వియా అంటే చాలా ఇష్టం. ఇది చాలా సందర్భాలలో, అనేక ప్రోగ్రామ్స్ లో తెలియచేసాడు. బిగ్ బాస్ లో కూడా చాలా సార్లు తన కూతురిని తలుచుకొని మిస్ అవుతున్నాను అంటూ బాధపడ్డాడు. హౌస్ లో ప్రతిరోజూ నిద్ర లేవగానే వియా ఫోటో చూస్తాడు. సడెన్ గా ఇవాళ హౌస్ లోకి రావడంతో రవి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

Sitara Ghattamaneni : యాని మాస్టర్‌తో స్టెప్పులు ఇరగదీస్తున్న మహేష్ కూతురు.. ప్రాక్టీస్ దేనికోసమో?

ముందుగా రవి భార్య నిత్య వచ్చి రవిని హగ్ చేసుకొని ఏడ్చేసింది వియా రాలేదా అంటూ అడిగాడు రవి. రాలేదు అని చెప్పగానే డల్ అయ్యాడు. అంతలోనే పప్పా అంటూ వియా మాట వినబడటంతో పరిగెత్తుకుంటూ బయటకి వచ్చాడు రవి. వియా పరిగెత్తుకుంటూ వచ్చి రవిని హాగ్ చేసుకుంది. వియాని ఎత్తుకొని కబుర్లు చెప్పాడు ఆడించాడు. హౌస్ లో కంటెస్టెంట్స్ కూడా వియాతో ఆడుకున్నారు. రవి తన వీపుపై కూర్చోపెట్టి వియాని హౌస్ లో తిప్పాడు. వెళ్ళేటప్పుడు వియా చాలా ఏడ్చింది. రవి కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో ఈ ప్రోమో చాలా బాగుంది అని ప్రేక్షకులు అంటున్నారు.