Elon Musk: ఇండియన్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. భారీ సంఖ్యలో భారతీయుల తొలగింపు

ట్విట్టర్ ఇండియా ఉద్యోగులకు శుక్రవారం ఒక పీడకలగా మిగిలింది. భారీ సంఖ్యలో భారతీయ ఉద్యోగుల్ని కంపెనీ నుంచి తొలగించారు. ఈ మేరకు మెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉద్యోగులు కంపెనీ అకౌంట్స్ నుంచి లాగౌట్ అయ్యారు.

Elon Musk: ఇండియన్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. భారీ సంఖ్యలో భారతీయుల తొలగింపు

Elon Musk: ట్విట్టర్ సంస్థ నుంచి దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించాలన్న ఎలన్ మస్క్ నిర్ణయం భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇండియన్ ఎంప్లాయిస్‌‌లో ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. శుక్రవారం ఎక్కువ మంది భారతీయుల్ని తొలగించారు.

Hyderabad: మేడ్చల్ జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి… అందరూ అంబర్‌పేట వాసులే!

ట్విట్టర్ ఇండియా ఆఫీస్ ‌నుంచి భారీ స్థాయిలో ఉద్యోగుల్ని వారి సిస్టమ్స్ నుంచి లాగౌట్ చేయించారు. శుక్రవారం సాయంత్రంలోపు తమ ఉద్యోగాల్ని వదులుకోవాలని కంపెనీ ఆదేశించింది. దీంతో చాలా మంది తీవ్ర వేదనకు గురయ్యారు. ఉన్నట్టుండి, ఒక్క రోజులోనే ఇలాంటి ఆదేశాలు రావడంతో చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. మన దేశం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులకు ట్విట్టర్ ఇలాంటి ఈమెయిల్స్ పంపింది. విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ట్విట్టర్ ఇండియా ఉద్యోగులు అధిక సంఖ్యలో లాగౌట్ అయ్యారు. తమను ఉద్యోగంలోంచి ఉన్నపళంగా తొలగించడంపై అనేక మంది ట్విట్టర్ వేదికగా తమ వేదన పంచుకుంటున్నారు.

BiggBoss 6 Day 61 : బిగ్‌బాస్‌‌లో కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా??

చాలా కొద్ది మంది మాత్రం ట్విట్టర్‌ను వదిలినందుకు సంతోషపడుతుంటే, ఎక్కువ సంఖ్యలో ఆవేదన చెందుతున్నారు. కాగా, గతంలో ఉన్న అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కనీసం 7,500 మంది ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. వీరిలో భారతీయులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే, ఇండియా నుంచి ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించారో ఇంకా స్పష్టత లేదు.