Sumatran Titan Arum: కుళ్ళినకంపు కొట్టే పువ్వు.. కానీ ఎగబడిన జనం!

పువ్వంటే సువాసన రావాలి.. అలా మంచి వాసన వెదజల్లే పూలకే డిమాండ్. అలాంటి పువ్వులనే మనుషులు ఇష్టపడేది. వాసనలేని పూలను పూజకు పనికిరావని పెద్దల సిద్ధాంతం. అయితే.. కుళ్ళిన కంపు కొట్టే ఓ పువ్వు కోసం జనాలు ఎగబడుతున్నారు.

Sumatran Titan Arum: కుళ్ళినకంపు కొట్టే పువ్వు.. కానీ ఎగబడిన జనం!

Sumatran Titan Arum

Sumatran Titan Arum: పువ్వంటే సువాసన రావాలి.. అలా మంచి వాసన వెదజల్లే పూలకే డిమాండ్. అలాంటి పువ్వులనే మనుషులు ఇష్టపడేది. వాసనలేని పూలను పూజకు పనికిరావని పెద్దల సిద్ధాంతం. అయితే.. కుళ్ళిన కంపు కొట్టే ఓ పువ్వు కోసం జనాలు ఎగబడుతున్నారు. అది కూడా ఆ పువ్వు బాగా కుళ్ళిన మాంసం కంపు కొడుతోంది. అయినా ప్రజలు మాత్రం సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీలు పడీమరీ ఆ పువ్వు చుట్టూ తిరుగుతున్నారు.

పోలాండ్‌లోని వార్సా యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్‌లో అమోర్ఫోఫాలస్ టైటనం అనే ఓ పుష్పం ఆదివారం వికసించింది. దాని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అయిన్పటికీ ఈ పుష్పాన్ని చూడడాకిని వందల మంది జనం క్యూ కడుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ పువ్వు దాదాపు 10 అడుగులు ఎత్తు ఉండగా బాగా కుళ్ళిన రంగులోనే దీని ఆకులు కూడా ఉంటాయి. మాంసాన్ని తినే పరపరాగ సంపర్కం కీటకాలను ఆకర్శించేందుకే ఈ పువ్వు ఈ వాసన వెదజల్లుతుండగా అరుదుగా కనిపించే పువ్వు కావడంతో ఇప్పుడు జనాలు ఎగబడుతున్నారు.

గతంలో సుమత్రాలోని వర్షారణ్యాలలో మాత్రమే పెరిగే ఈ మొక్కకి అటవీ నిర్మూలన కారణంగా ప్రమాదం వచ్చి పడడంతో వార్సా యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్‌లో దీన్ని సంరక్షిస్తున్నారు. కాగా, అరుదుగా పుస్పించే ఈ పుష్పం ఇప్పుడు చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇక సుమత్రా అడవుల్లో కాకుండా ఈ పుష్పం మొట్టమొదట 1889లో క్యూలోని లండన్ రాయల్ బొటానికల్ గార్డెన్స్‌లో వికసించింది.