Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?

ఇక ఇదే కేసులో సోనియాగాంధీ కుమారుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఈడీ 5రోజులపాటు విచారించింది. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఐదు రోజుల్లో 50గంటలకుపైగా విచారించిన ఈడీ.. స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసింది.

Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?

Sonia

Sonia ED Summons : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. జూలై మధ్య నాటికి విచారణలో పాల్గొనాలని తాజా నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో విచారణ అంశంపై రెండు రోజుల క్రితం ఈడీకి సోనియా గాంధీ లేఖ రాశారు. కరోనా సోకడంతో తన ఆరోగ్యం బాగోలేదని, విచారణను వాయిదా వేయాలని ఈడీని కోరారు.

సోనియా గాంధీ అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంగీకరించింది. కోవిడ్‌తో బాధపడుతున్న ఆమెను విచారించడానికి ఇది సరైన సమయం కాదని భావించి.. విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా సమన్లు జారీ చేసిన ఈడీ.. జులై మధ్యలో విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది.

National Herald Case: ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కేం సంబంధం..

ఇక ఇదే కేసులో సోనియాగాంధీ కుమారుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఈడీ 5రోజులపాటు విచారించింది. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఐదు రోజుల్లో 50గంటలకుపైగా విచారించిన ఈడీ.. స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసింది. ఈ కేసులో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది. అయితే ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు రాహుల్‌ సమాధానం చెప్పారు.