India vs England: భార‌త బౌల‌ర్ల ధాటికి రాణించ‌లేక‌పోతున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో అలెక్స్ లీస్ 6, జాక్ క్రావ్లీ 9, ఓల్లి పోప్ 10, జో రూట్ 31, జాక్ లీచ్ 0, బెన్ స్టోక్స్ 25 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ స్కోరు 178/6 గా ఉంది.

India vs England: భార‌త బౌల‌ర్ల ధాటికి రాణించ‌లేక‌పోతున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌

Teaminida Test

India vs England: ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆతిథ్య టీమ్‌తో భార‌త్ ఐదో టెస్టు మ్యాచు ఆడుతోంది. మొద‌టి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తోంది. భార‌త బౌల‌ర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్‌మెన్స్ చెప్పుకోద‌గ్గ ప‌రుగులు చేయ‌లేక‌పోతోన్న స‌మ‌యంలో బెయిర్‌స్టో మాత్రం అర్ధ సెంచ‌రీ బాదాడు.

Maharashtra: న‌న్ను సీఎంను చేసి మోదీ, షా అంద‌రి క‌ళ్ళూ తెరిపించారు: ఏక్‌నాథ్ షిండే

ప్ర‌స్తుతం క్రీజులో బెయిర్ స్టో 72, సామ్ బిల్లింగ్స్ 6 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో అలెక్స్ లీస్ 6, జాక్ క్రావ్లీ 9, ఓల్లి పోప్ 10, జో రూట్ 31, జాక్ లీచ్ 0, బెన్ స్టోక్స్ 25 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ స్కోరు 178/6 గా ఉంది. కాగా, గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టునే ఇప్పుడు నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. క‌రోనా సోకడంతో ఈ టెస్టు నుంచి భార‌త‌ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వైదొలగడంతో ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రా సార‌థ్య బాధ్య‌త‌ల్లో కొన‌సాగుతున్నాడు.