Gunde Katha Vintara : ‘హాయో, మాయో.. అంతా కొత్త‌గా ఉంది.. ఐనా ఇదే బాగుంది’.. సోల్ ఫుల్ మెలొడీ విన్నారా!..

పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధు నంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు..

Gunde Katha Vintara : ‘హాయో, మాయో.. అంతా కొత్త‌గా ఉంది.. ఐనా ఇదే బాగుంది’.. సోల్ ఫుల్ మెలొడీ విన్నారా!..

Entha Baavundo Lyrical Video From Gunde Katha Vintara Movie

Gunde Katha Vintara: పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధు నంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌ల‌తో ‘ఎంత బావుందో…‌’ అనే లిరిక‌ల్ సాంగ్‌ని రౌడీ స్టార్ విజ‌య్‌ దేవ‌ర‌కొండ రిలీజ్‌ చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

‘‘ఎంత బావుందో.. ప‌క్క‌నే ఉన్నా, మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా.. గుప్పెడు గుండె త‌ట్టింది.. ఎవ‌రో నాకు చెప్పింది.. పైకే చెప్ప‌నంటోంది.. హాయో, మాయో, అంతా కొత్త‌గా ఉంది.. ఐనా ఇదే బాగుంది, బ‌హుశా ఎదురుప‌డ‌నంది’’.. అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మ‌సాలా కాఫీ సంగీతం స‌మ‌కూర్చ‌గా కృష్ణ చైత‌న్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వ‌రుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆల‌పించారు. ‌

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: వంశీధ‌ర్
నిర్మాత‌లు : క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప
బ్యాన‌ర్‌: ట్రినిటి పిక్చర్స్
సినిమాటోగ్ర‌ఫీ: ర‌వి వ‌ర్మ‌న్ నీలిమేఘం, సురేష్ భార్గ‌వ్‌
సంగీతం: మ‌సాల కాఫీ
ఎడిట‌ర్‌: సాయి కిర‌ణ్ ముద్దం
యాక్ష‌న్‌: ‘రియ‌ల్’ స‌తీష్
కొరియోగ్ర‌ఫీ: భాను మాస్ట‌ర్
లిరిక్స్‌: కృష్ణ చైత‌న్య
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: గౌరీ నాయుడు..