‘ఏంట్రా మన ఖర్మ’ అంటున్న ‘మక్కల్ సెల్వన్’

‘ఏంట్రా మన ఖర్మ’ అంటున్న ‘మక్కల్ సెల్వన్’

Entra Mana Kharma: ‘నేనూ రౌడీనే’, ‘మాస్టర్’ ‘ఉప్పెన’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, ప్రముఖ నటుడు జయరామ్‌లు హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కొని మతాయ్’. ఈ చిత్రానికి సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ‘రేడియో మాధవ్’ పేరుతో లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ అధినేత, నిర్మాత కృష్ణస్వామి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మలయాళంలో మంచి విజయంసాధించింది. అతి తక్కువ సమయంలో తమిళంలో కథానాయకుడిగా, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి మలయాళంలో నటించిన ఫస్ట్ సినిమా ఇది.

https://10tv.in/sreevishnu-launches-vijay-sethupathis-radio-madhav-firstlook/

ఇటీవల ‘ఏంట్రా మన ఖర్మ’ అనే పాట రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. దీంతో తాజాగా ఈ సాంగ్ రీమిక్స్ వెర్షన్ విడుదల చేశారు. ఎమ్. జయ చంద్రన్ సంగీత మందిచగా భాషా శ్రీ లిరిక్స్ రాశారు. ఈ పాట యూత్‌ని ఆకట్టుకుంటోంది. త్వరలో ‘రేడియో మాధవ్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.