PF విత్‌డ్రా చేస్తున్నారా? 3 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు పడతాయి!

  • Published By: srihari ,Published On : June 3, 2020 / 02:18 PM IST
PF విత్‌డ్రా చేస్తున్నారా? 3 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు పడతాయి!

ఎంప్లాయిస్ ప్రావిడియంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని అనుకుంటున్నారా? పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ ఆలస్యమవుతుందా? అయితే Covid pandemic rule కింద పీఎఫ్ విత్ డ్రా క్లయిమ్ చేసుకోండి కేవలం మూడు రోజుల్లోనే మీ అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయి. కొవిడ్ రూల్ కింద ఆటోమాటిక్ ప్రాసెస్ ద్వారా కేవలం 72 గంటల్లోనే విత్ డ్రా ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఇదే విషయాన్ని పీఎఫ్ ఖాతాదారులందరికి EPFO సంస్థ సూచిస్తోంది. పీఎఫ్ విత్ డ్రా చేయాలనుకునేవారు కొవిడ్ సంబంధిత క్లయిమ్ చేసుకుంటే వెంటనే నగదు ఉపసంహరణ చాలా వేగంగా ఉంటుందని పేర్కొంది. ఈపీఎఫ్ విత్ డ్రా కోసం (Form-31) దరఖాస్తును Outbreak of Pandemic -‘Covid-19 రూల్ కింద ఎంచుకోవాల్సి ఉంటుందని రిటైర్మెంట్ ఫండ్స్ విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఒకసారి ఈపీఎఫ్ విత్ డ్రా కోసం దరఖాస్తు చేసుకున్నా నగదు విత్ డ్రా చేసుకులేనివారికి మరోసారి అవకాశం ఇస్తోంది.
provident fund

కొవిడ్-19 కింద వేగంగా ఉపశమనం పొందేందుకు ఆన్ లైన్ ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చునని తెలిపింది. ఇతర అడ్వాన్స్ ఏదైనా పెండింగ్ లో ఉన్నప్పటికీ కొవిడ్-19 దరఖాస్తు చేసేందుకు అనుమతి ఉంటుందని సంస్థ క్లారిటీ ఇచ్చింది. ‘కొవిడ్-19 కింద ఆన్ లైన్ దరఖాస్తులు ఆటో మోడ్ ద్వారా కేవలం 72 గంటల్లో పూర్తి అవుతుంది. దీనికి ఫుల్ KYC కూడా అవసరం లేదు. సాధారణ దరఖాస్తు మాదిరిగా ఎక్కువ సమయం తీసుకోదు. ఇతర క్లయిమ్స్ కూడా ప్రాసెసింగ్ చేస్తున్నామని ఈపీఎఫ్ఓ పేర్కొంది. 

అడ్వాన్స్ పీఎఫ్‌కు దరఖాస్తు ప్రక్రియ పూర్తిన వెంటనే మూడు రోజుల్లోగా అకౌంట్లోకి నగదు జమ అవుతుంది. మీ అకౌంట్లో నగదు క్రెడిట్ చేసేందుకు  సంబంధిత బ్యాంకులో ఈపీఎఫ్ఓ చెక్ పంపిస్తుంది. దీనికి బ్యాంకులు ఎక్కడైనా సరే కేవలం 1 నుంచి 3 రోజుల్లోగా అకౌంట్లో నగదును జమ చేస్తాయి. Covid pandemic విత్ డ్రా రూల్ కింద 75 శాతం మేర ప్రొవిడియంట్ ఫండ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు (ఎంప్లాయి షేర్, ఎంప్లాయిర్ షేర్) రెండూ ఉంటాయి. లేదా మూడు నెలల కనీస వేతనం, DA, తక్కువగా ఉండాలి. దీనికంటే తక్కువగా ఉంటే మీరు కూడా పీఎఫ్ కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. కానీ, మీ బ్యాంకు అకౌంట్ చెక్ ఫొటోను స్కాన్ చేసి జత చేయాల్సి ఉంటుంది. 

విత్ డ్రా ప్రాసెస్ ఇదిగో : 
* EPFO’s Unified Portalలో సబ్ స్ర్కైబర్లు Login చేయండి. 
* Go to Online Services Claim (Form-31,19,10C & 10D) ఆప్షన్ ఎంచుకోండి.
* (UAN) వెరిఫై చేసిన బ్యాంకు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి.
* ‘Proceed For Online Claim’ క్లిక్ చేయండి. 
* PF Advance (Form 31) ఆప్షన్ కిందికి స్ర్కోల్ చేయండి. 
* “Outbreak of pandemic (COVID-19)” ఎంపిక చేసుకోండి. 
*  ఎంత నగదు కావాలో ఎంటర్ చేయండి. 
* స్కాన్ చేసిన మీ బ్యాంకు చెక్, మీ అడ్రస్ ఎంటర్ చేయండి. 
* “Get Aadhaar OTP” పై క్లిక్ చేయండి. 
* ఆధార్ లింక్ అయిన మొబైల్ ఫోన్ నెంబర్ కు OTP వస్తుంది.
* మీ దరఖాస్తు పూర్తి అయినట్టే..