Etela Rajender : ఈటల మోకాలికి ఆపరేషన్..పాదయాత్ర లేనట్లేనా

ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్రపై సందిగ్ధత నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ఈటల చేపట్టిన పాదయాత్రలో అస్వస్థతకు గురి కావడంతో ఈటలను ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో ఈటలకు మోకాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో పాదయాత్ర వాయిదా పడనుందా?లేదా మొత్తానికి రద్దు కానుందా?అన్నట్లుగా ఉంది.

Etela Rajender : ఈటల మోకాలికి ఆపరేషన్..పాదయాత్ర లేనట్లేనా

Etela Rajender Padayathra

Etela Rajender: ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్రపై సందిగ్ధత నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ఈటల చేపట్టిన పాదయాత్రలో అస్వస్థతకు గురి కావడంతో ఈటలను ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో ఈటలకు మోకాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. వారం రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన ఉండనున్నారు. వారం, పది రోజుల తర్వాత డాక్టర్ సూచన మేరకు పాదయాత్రపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

హుజూరాబాద్‌లో 22 నుంచి 25 రోజుల పాటు నియోజకవర్గం మొత్తం ప్రజాదీవెన పేరుతో పాదయాత్ర ఉంటుందని ముందు ప్రకటించారు. మధ్యలో ఈటల అస్వస్థతకు గురికావడంతో 12 రోజులకే ఆటల అనారోగ్యంబారిన పడటంతో పాదయాత్రకు బ్రేక్ పడింది. కానీ..ఈటల కోలుకున్నాక పాదయాత్ర తిరిగి కొనసాగిస్తాడని బీజేపీ వర్గాలు చెబుతన్నా..అది సాధ్యమయ్యేట్లుగా కనిపించటంలేదు. ఎందుకంటే ఆయనకు మోకాలి ఆపరేషన్ జరిగితే ఇప్పట్లో ఆయన నడిచే అవకాశాలు ఉండవు.ఇటువంటి సమయంలో ఇక పాద్రయాత్ర దాదాపు నిలిచిపోయినట్లుగానేతెలుస్తోంది.

కాగా..మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈక్రమంలో పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. దీంతో తన నియోజకవర్గంలో ఈటల ప్రజాదీవెన పేరుతో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని తన వర్గాన్ని మరింతగా బలపరుచుకోవాలనుకున్నారు. బీజేపీ తరపున పోటీ చేసి తన నియోజక వర్గంలో పట్టు కోల్పోకుండా..టీఆర్ఎస్ ముందు అప్రతిష్టపాలు కాకుండా ఉండేందుకు ఆయన శతవిధాలా యత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఆయన హుజూరాబాద్ నియోజక వర్గంలో పాదయాత్ర చేపట్టారు.

ఈ క్రమంలో వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తుండగా.. ఈటల అనారోగ్యానికి గురయ్యారు. డాక్టర్లు ఈటలకు వైద్యపరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్‌, బీపీ స్థాయిలు పడిపోయినా ఆయన ఆరోగ్యం నిలికడగానే ఉంది. ఈటల అనారోగ్యం పాలవడం..మోకాలికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావటంతో ఇక పాదయాత్ర దాదాపు వాయిదా పడే అవకాశం ఉంది. రాజేందర్‌ బదులు ఆయన సతీమణి జమున పాదయాత్ర నిర్వహించే అవకాశముందని ఈటల సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.