Congress: అప్ప‌ట్లో రాజులూ ఇలా చేసేవారు కాదు: గులాం న‌బీ ఆజాద్

కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అన్ని గంటల‌పాటు విచారించ‌డం ఏంట‌ని, ఆమె వ‌య‌సు, ఆరోగ్య ప‌రిస్థితిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు దృష్టిలో పెట్టుకోవాల‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ అన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... యుద్ధాల‌లోనూ రాజులు త‌మ సైన్యానికి ఓ విష‌యం చెప్పేవార‌ని, మ‌హిళ‌ల‌పై దాడి చేయొద్ద‌ని, పోరాడే సామ‌ర్థ్యం లేని వారిని వ‌దిలేయాల‌ని సూచించేవార‌ని అన్నారు.

Congress: అప్ప‌ట్లో రాజులూ ఇలా చేసేవారు కాదు: గులాం న‌బీ ఆజాద్

Azad

Congress: కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అన్ని గంటల‌పాటు విచారించ‌డం ఏంట‌ని, ఆమె వ‌య‌సు, ఆరోగ్య ప‌రిస్థితిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు దృష్టిలో పెట్టుకోవాల‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ అన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… యుద్ధాల‌లోనూ రాజులు త‌మ సైన్యానికి ఓ విష‌యం చెప్పేవార‌ని, మ‌హిళ‌ల‌పై దాడి చేయొద్ద‌ని, పోరాడే సామ‌ర్థ్యం లేని వారిని వ‌దిలేయాల‌ని సూచించేవార‌ని అన్నారు.

సోనియా గాంధీ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం, ఈడీ వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు స‌రికాద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. చ‌ట్టాల‌ను ఆయుధాలుగా మ‌లుచుకుని, వాటితో విప‌క్షాల‌ను ల‌క్ష్యాలుగా చేసుకోవ‌డం, ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డం స‌రికాద‌ని కాంగ్రెస్ నేత ఆనంద్ శ‌ర్మ అన్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టు త్వ‌ర‌గా తీర్పును వెల్ల‌డించాల‌ని రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గ‌హ్లోత్ కోరారు. సోనియా గాంధీని ఈడీ అధికారులు మూడ‌వ సారి విచార‌ణ‌కు పిలిచార‌ని ఆయ‌న గుర్తుచేశారు.

India vs West Indies: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా