ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు… సీజనల్‌ వ్యాధుల నివారణకు తెలంగాణలో కొత్త కార్యక్రమం

కొన్ని రోజుల్లో వర్షాకాలం వచ్చేస్తుంది. వర్షాకాలం అంటే వ్యాధుల కాలం. డెంగీ లాంటి సీజనల్ వ్యాధులు

  • Published By: naveen ,Published On : May 10, 2020 / 06:05 AM IST
ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు… సీజనల్‌ వ్యాధుల నివారణకు తెలంగాణలో కొత్త కార్యక్రమం

కొన్ని రోజుల్లో వర్షాకాలం వచ్చేస్తుంది. వర్షాకాలం అంటే వ్యాధుల కాలం. డెంగీ లాంటి సీజనల్ వ్యాధులు

కొన్ని రోజుల్లో వర్షాకాలం వచ్చేస్తుంది. వర్షాకాలం అంటే వ్యాధుల కాలం. డెంగీ లాంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. అసలే కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఇంకా ఆ గండం నుంచి పూర్తిగా బయటపడేలేదు. వర్షాకాలం వచ్చాక మరిన్ని సమస్యలు పెరగడం ఖాయం. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సీజనల్ వ్యాధుల నియంత్రణకు మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ”ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు”. ఇందులో భాగంగా అన్ని నీటి వనరులు, ట్యాంకులు, పైపు లైన్లు ఇతర నీటి నిల్వ ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రజలు కూడా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు తమ పరిధిలో నీరు నిలవకుండా చూసుకోవాలి.

ఇళ్లలోనే దోమల నివారణకు కృషి చేయాలి:
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కలుపుకునిపోవాలని మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆదివారం(మే 10,2020) నుంచి పురపాలక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ ఇళ్లలోనే దోమల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కలుపుకునిపోవాలని మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్ఫూర్తిగా నిలువాలని కేటీఆర్‌ కోరారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల కమిషనర్లు, అడిషనల్‌ కలెక్టర్లతో శనివారం(మే 9,2020) మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 

కరోనాతో సహజీవనం తప్పదు:
కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపోయే అవకాశం లేదని, దానిని నిర్మూలించే వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ వైరస్‌తో సహజీవనం చేయకతప్పదని మంత్రి కేటీఆర్‌ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కరోనా వ్యాప్తికి ఆస్కారం ఉంటుందని, అందువల్ల ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మున్సిపల్‌ కమిషనర్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి-బేసి విధానంలో భాగంగా దుకాణాల నిర్వహణను కమిషనర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతికదూరం పాటించడం లాంటివి కొనసాగించాల్సిన బాధ్యత కమిషనర్లదేనని చెప్పారు. కరోనాను అరికట్టే వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ ఆ మహమ్మారితో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొందని, అందుకు అనుగుణంగా ముందుజాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.