Exercises : జుట్టు రాలటం, బొడ్డు చుట్టు కొవ్వు తగ్గించే వ్యాయామాలు ఇవే…

స్క్వాట్ అనేది బాడీ వెయిట్ ను తగ్గించే వ్యాయామం, కాలి కండరాలను లక్ష్యంగా చేసుకుని వాటిని బలోపేతం చేయటానికి ఉపయోగపడుతుంది.

Exercises : జుట్టు రాలటం, బొడ్డు చుట్టు కొవ్వు తగ్గించే వ్యాయామాలు ఇవే…

Exercises

Exercises : జట్టు రాలిపోవటం, బొడ్డు చుట్టు కొవ్వు చేరటం ఇటీవలి కాలంలో పురుషుల్లో కామన్ గా కనిపిస్తున్నసమస్యలు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. పనివత్తిళ్ళు, రోజంతా కూర్చోని ఉండటం, శారీరక శ్రమలేకపోవటం వల్ల పొట్ట బాగంలో కొవ్వు పోగుబడిపోతుంది. సరైన ఆహారం తీసుకోకపోవటం, జీవనశైలి అలవాట్లు వెరసి జుట్టు రాలిపోవటానికి కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి సమస్యలన్నింటిని అదిగమించేందుకు వ్యాయామం చక్కని పరిష్కార మార్గం.

అధిక బరువు తగ్గాలనుకునే వారికి మాత్రమే కాకుండా దీర్షకాలం జీవించాలనుకునే వారు వ్యాయామం చేయటం అవసరం. ప్రతిరోజు 30 నుండి 40 నిమిషాలపాటు వ్యాయామాలు చేయటం ద్వారా పొట్టు చుట్టూ తయారయ్యే ఫ్యాట్ ను కరిగించుకోవటంతోపాటు, మెరిసే కాంతి వంతమైన చర్మాన్ని మీసొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది.

స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్, ఛాతీకి సంబంధించిన మూడు వ్యాయామాలు చేయటం వల్ల జుట్టు రాలటం, బొడ్డు చుట్టూ ఏర్పడే కొవ్వును కరిగించుకోవటంతోపాటు, మొత్తం ఆరోగ్యానికి ఈ వ్యాయామాలు ఎంతగానో దోహదపడతాయి. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ మూడు వ్యాయామాల వల్ల కలిగే ప్రయోజనాలను నెటిజన్స్ తో పంచుకున్నారు. ఈ మూడు వ్యాయామాలు పురుషుల్లో టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్లు, డోపామైన్ స్ధాయిని పెంచేందుకు దోహదం చేస్తాయి. జుట్టు రాలటంతోపాటు, బొట్ట ఉబ్బరంగా ఉన్న సమ్యను తగ్గిస్తుంది.

స్క్వాట్ అనేది బాడీ వెయిట్ ను తగ్గించే వ్యాయామం, కాలి కండరాలను లక్ష్యంగా చేసుకుని వాటిని బలోపేతం చేయటానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యాయామాన్ని చాలా ఈజీగా చేయవచ్చు. మోకాళ్ళను వంచి చేతులను ముందుకు చాస్తూ 2నుండి 3 సెకన్లపాటు అలాగే ఉండాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇక సాంప్రదాయ బద్దమైన డెడ్ లిఫ్ట్ శరీర కండరాలను మరింత బలోపేతం చేయటంలో చక్కగా ఉపయోగపడుతుంది. బరువును ఎత్తటం ద్వారా శరీరంలోని అన్నిబాగాలు చురుకుగా మారతాయి. నేలపైన ఉంచిన వెయిట్ లిఫ్ట్ ను మోకాళ్లతో వంగి లిప్ట్ ను నిదానంగా చేతులతో పైకెత్తాలి. దీనివల్ల చాతిబాగంలోని కండరాలపై దాని ప్రభావం ఉంటుంది. కొన్ని సెకన్లపాటు ఇలా ఉంచిన తరువాత నిదానంగా బరువును క్రింది దింపి వేయాలి. వెయిట్ లిప్ట్ లాగానే డంబెల్ ను ఉపయోగించినా సరిపోతుంది. కండరాల బిగుతుతనానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఇక మూడవది ఛాతికి కూడా ఛాతికి సంబంధించిన వ్యాయామమే. వెనుకకు పడుకుని రెండు చేతులతో బార్ బెల్ పట్టుకోవాలి. మోచేతులను వంచుతూ బార్ బెల్ ను ఛాతి వద్దకు బరువును తీసుకు రావటం తిరిగి వెనక్కు తీసుకెళ్ళటం ఇలా చేస్తూ ఉంటే చేతుల కండరాలతోపాటు, ఇలా 15 నుండి 20 సార్లు చేయాలి. ఇలా చేస్తే