One Plus : పేలిన వన్‌ప్లస్ నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్… కంపెనీ ప్రకటన చూసి ఖంగుతిన్న కష్టమర్

ఈఘటనకు సంబంధించిన వన్ ప్లస్ ఎలా స్పందిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే వన్ ప్లస్ ప్రతినిధులు బాధిత వినియోగదారుడిని సంప్రదించింది.

One Plus : పేలిన వన్‌ప్లస్ నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్… కంపెనీ ప్రకటన చూసి ఖంగుతిన్న కష్టమర్

One Plus

One Plus : సెల్ ఫోన్ల వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. వినియోగదారుల కోసం సెల్ తయారీ కంపెనీలు ఆకర్షణీయమైన మోడళ్ళను తయారీ చేస్తున్నాయి. అయితే వాటి భద్రతా ప్రమాణాలపై అనేక అనుమానాలు రెకెత్తుతున్నాయి. తాజాగా బెంగుళూరుకుచెందిన అంకూర్ శర్మ తన భార్యకోసం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ తయారు చేసిన వన్ ప్లస్ నార్డ్ 2 5జీ మొబైల్ ను కొనుగోలు చేశాడు.

అంకూర్ శర్మ భార్య పట్టుమని ఐదురోజులు కూడా వాడకుండానే హ్యాండ్ బ్యాగ్ లో నుండి బయటకు తీస్తున్న  సమయంలో ఒక్కసారిగా మొబైల్ పేలిపోయింది. పేలిపోయిన మొబైల్ ఫోటోను అంకూర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. సెల్ పోన్లు పేలిపోవటం ఇదేం మొదటి సారి కాదు. గతంలో కూడా  పేరున్న కంపెనీల మొబైల్స్ సైతం పేలిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి.

ఈఘటనకు సంబంధించిన వన్ ప్లస్ ఎలా స్పందిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే వన్ ప్లస్ ప్రతినిధులు బాధిత వినియోగదారుడిని సంప్రదించింది. ఆ కొంత సమయం తరువాత ట్విట్టర్ లో బాధితుడు పెట్టిన పోస్టు సైతం డిలీటై పోయింది. అనంతరం ఫోన్ పేలిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన వన్ ప్లస్ తీరిగ్గా ఓ ప్రకటన విడుదల చేసింది.

సెల్ ఫోన్ పేలిన ఘటనపై తాము దర్యాప్తు నిర్వహించామని, బయటి కారకాల వల్లే ఫోన్ పెలుడు జరిగిందని తేలినట్లు చెప్పుకొచ్చింది కంపెనీ. నాణ్యత భద్రతకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాకే తాము మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తామని చెప్పింది. మొబైల్ పేలటానికి తయారీ లోపం ఏమాత్రం కారణం కాదని ప్రకటించింది.

కంపెనీ ప్రకటన చూసి నెటిజన్లు నోరెళ్ళబెడుతున్నారు. ఫోను పేలుడు ఘటనతో వన్ ప్లస్ ఫోన్లన్నీ రీప్లేస్ చేస్తుందని తామంతా ఊహించగా కంపెనీ మాత్రం దానిని తేలికగా తీసుకోవటం ఆశ్ఛర్యంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.