Heat Waves in Canada: కెనాడాలో వేడిగాలుల తీవ్రత..100కోట్ల సముద్రజీవుల మృత్యువాత

ఉష్ణోగ్రతలు 104 డిగ్రీల ఫారెహీట్ కు చేరటంతో సముద్రంలో వందల జీవులు మృత్యువాత పడి ఒడ్డుకు చేరుతున్నాయి. మృత్యువాత పడుతున్న జీవుల్లో స్టార్ ఫిష్, నత్తలు, కాపుష్కలే, రాక్ ఫిష్, క్లామ్స్ వంటి జీవులు అధికంగా ఉన్నాయి.

Heat Waves in Canada: కెనాడాలో వేడిగాలుల తీవ్రత..100కోట్ల సముద్రజీవుల మృత్యువాత

100కోట్ల సముద్రజీవుల మృత్యువాత

heat waves in Canada: కెనాడాలో గత వారం రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పులు అందరిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడి వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రధానంగా సముద్ర తీరం వెంబడి 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుండగా విపరీతమైన వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో ఇప్పటికే బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ లో వేడిగాలుల కారణంగా 500 వరకు ప్రజలు మృత్యువాత పడ్డారు.

మరోవైపు వేడిగాల ప్రభావం, వాతావరణంలో మార్పులు సముద్ర జీవులపై తీవ్రమైన ప్రభావాన్నిచూపుతున్నాయి. ఉష్ణోగ్రతలు 104 డిగ్రీల ఫారెహీట్ కు చేరటంతో సముద్రంలో వందల జీవులు మృత్యువాత పడి ఒడ్డుకు చేరుతున్నాయి. మృత్యువాత పడుతున్న జీవుల్లో స్టార్ ఫిష్, నత్తలు, కాపుష్కలే, రాక్ ఫిష్, క్లామ్స్ వంటి జీవులు అధికంగా ఉన్నాయి. వారం రోజుల వ్యవధిలో 100కోట్ల సముద్ర జీవరాశులు మృత్యవాత పడినట్లు అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్ధితులు సముద్ర జీవులపై వినాశకరమైన ప్రభావాన్ని చూపిస్తుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సముద్రంలో ఉండే చిన్నచిన్న జీవులు సాధారణంగా 30 డిగ్రీల సెల్సియస్ వాతావరణాన్ని తట్టుకుని బత్రకగలుగుతాయి. అయితే ప్రస్తుతం నెలకొన్ని అత్యధిక వేడి వాతావరణ పరిస్ధితులను అవి ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. మృత్యువాత పడి సముద్రపు ఒడ్డుకు కొట్టుకువస్తున్న జీవరాశులను చూసి పర్యావరణ వేత్తలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ పరిణామం రానున్న రోజుల్లో పర్యావరణం పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు. కొన్ని జీవుల ఉనికికే ప్రమాదం ఏర్పడితే తిరిగి అవి తమ సంతతిని పెంచుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.

మరో వారం రోజుల పాటు ఇలాంటి వేడి గాలలుతో కూడిన వాతావరణ పరిస్ధితులు అక్కడ కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితితో అక్కడి ప్రజలు ఎక్కవ సమయంల బయట తిరిగేందుకు ఇష్టపడటంలేదు. ఇంట్లోనే చల్లటి వాతావరణంలో గడిపేందుకు ఇష్టంపడుతున్నారు.