ఆగస్టు 27 నుండి మోర్ ఫన్..

ఆగస్టు 27 నుండి మోర్ ఫన్..

F3: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, హాట్ బ్యూటీ మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫన్ ఎంటర్‌టైనర్.. ‘ఎఫ్ 2’.. గతేడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం.. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా
మోర్ ఫన్‌తో అదే టీమ్‌తో మరోసారి నవ్వులజల్లు కురిపించడానికి ‘ఎఫ్3’ రూపొందుతోంది..

F3

ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ‘ఎఫ్3’ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగస్టు 27న నవ్వుల పువ్వులు పూయించడానికి సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నామని టీమ్ తెలిపారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.