గమనిక : మే 01 నుంచి మాస్క్ లు తప్పనిసరి

  • Published By: madhu ,Published On : April 30, 2020 / 12:19 PM IST
గమనిక : మే 01 నుంచి మాస్క్ లు తప్పనిసరి

కరోనా వైరస్ నుంచి కట్టడి చేసేందుకు..దీని నుంచి తప్పించుకొనేందుకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం. ఏంటీ..ఇప్పటికే ఈ నిబంధన అమలు చేస్తున్నారు..కదా..అంటున్నారు కదా..కానీ తెలుగు రాష్ట్రాల్లో కాదు. జమ్మూ కాశ్మీర్ లో. కరోనా బారిన పడకుండా..ప్రజలందరూ మాస్క్ లు ధరించాలని..2020, మే 01 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని శ్రీ నగర్ జిల్లా మెజిస్ట్రేట్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వెల్లడించారు. 

మాస్క్ ధరించకపోతే..విపత్తు నిర్వాహణ చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని వెల్లడించారు. ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలు, కార్యాలయాలు, షాపింగ్, మార్కెట్, బహిరంగ ప్రదేశాల్లో  మెడికల్ గ్రేడ్ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.

అంతేగాకుండా..ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, దుకాణాలు, జన సంచారం ఉన్న ప్రాంతాల్లో శానిటైజ్, హ్యాండ్ వాష్  లను ఏర్పాటు చేయాలని సూచించింది. RRD నోడల్ డిపార్ట్ మెంట్ ఆదేశాల ప్రకారం…15 లక్షల మాస్క్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శ్రీనగర్ అంతటా…ప్రతి కుటుంబానికి ఐదు మాస్క్ లు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. 

జమ్మూ కాశ్మీర్ లో 581 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 8 మంది చనిపోయారు. 192 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.