ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన ప్రముఖ హీరో

ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన ప్రముఖ హీరో

మలయాళ ప్రముఖ నటుడు, ట్రాన్స్(Trance) అనే సైకలాజికల్ సినిమా ద్వారా ప్రతీ భాషకు పరిచయం అయిన హీరో ఫాహద్ ఫాసిల్ షూటింగ్‌లో గాయపడ్డారు. కొచ్చిలో ‘మలయన్కుంజు’ సినిమా చిత్రీకరణ సమయంలో బిల్డింగ్‌‌పై నుంచి దూకే సన్నివేశం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. బ్యాలెన్స్‌ అదుపుతప్పి ఫాసిల్ బిల్డింగ్‌పై నుంచి పడిపోయినట్లు తెలుస్తోంది.

తీవ్రంగా గాయపడిన ఫాసిల్‌ను కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నరు. ఈ ప్రమాదంలో ఫాసిల్ ముక్కుకు బలమైన గాయం తగలగా.. స్వల్ప గాయాలైనట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఫాసిల్ ఆరోగ్యం నిలకడగా ఉండగా.. బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఫాసిల్ భార్య ప్రముఖ హీరోయిన్ నజ్రియా. విషయం తెలిసిన వెంటనే ఫాహద్‌ భార్య, నటి నజ్రియా ఆసుపత్రికి చేరుకున్నారు.

ప్రస్తుతం మలయాళంలో అరడజనుకు పైగా సినిమాల్లో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. ట్రాన్స్, సూపర్ డీలక్స్ సినిమాలో కనిపించి మెప్పించిన ఫాసిల్.. 2014లో నజ్రియాను పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నజ్రియా..ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. రాజారాణి సినిమాతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.