Fake Baba: ఐదు పెళ్లిళ్ల దొంగ బాబా.. ఆరో పెళ్లికి సిద్దమవగా అరెస్ట్!
తాంత్రికుడిగా.. మహిమలున్న బాబాగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న ఓ వ్యక్తి ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం ఐదుగురి మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అందులో ఒక్కరికీ చట్టబద్దంగా విడాకులు ఇవ్వకపోగా అందులో ఒకరు చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు.

Fake Baba
Fake Baba: తాంత్రికుడిగా.. మహిమలున్న బాబాగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న ఓ వ్యక్తి ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం ఐదుగురి మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అందులో ఒక్కరికీ చట్టబద్దంగా విడాకులు ఇవ్వకపోగా అందులో ఒకరు చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కాగా.. ఈ దొంగ బాబా ఆరో పెళ్ళికి సిద్దమవగా ఐదవ భార్య ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.
కాన్పూర్ లోని షహనాజ్‌పూర్‌కు చెందిన అనూజ్ చేతన్ కథేరియా 2005లో మొదటి సారి వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. ఇదిలా ఉండగానే 2010లో అనూజ్ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా అనూజ్ వేధింపులు తట్టుకోలేక విడిపోగా నాలుగేళ్ళకు అనూజ్ మూడో వివాహం చేసుకున్నాడు. ఆమె ఉండగానే ఆమె బంధువును నాలుగో వివాహం చేసుకోగా ఆమె కొన్నిరోజులకు ఆత్మహత్య చేసుకుంది.
ఈ క్రమంలో 2019లో అనూజ్ ఐదోసారి వివాహం చేసుకోగా వేధింపులు తట్టుకోలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే ఐదో భార్య అనూజ్ పెళ్లిళ్ల విషయం తెలుసుకొని దూరంగా ఉంటుంది. అయితే అనూజ్ మాత్రం ఆరవ పెళ్ళికి సిద్దమయ్యాడు. విషయం తెలుసుకున్న ఐదవ భార్య కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అనూజ్‌ని అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో అనూజ్ పోలీసులే విస్తుపోయే నిజాలు వెల్లడించాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తాను వీరందరిని మోసం చేశానని తెలిపిన అనూజ్ లక్కీ పాండేగా పేరు మార్చుకుని.. తప్పుడు అడ్రెస్‌లతో మోసం చేసేవాడినని వెల్లడించాడు. ప్రభుత్వ ఉద్యోగి, క్లర్క్, టీచర్, బాబా, తాంత్రికుడిగా అవతారాలెత్తి వారిని నమ్మించినట్లు దర్యాప్తులో వెల్లడించాడు.